ETV Bharat / state

కరోనా పరీక్షల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానం - corona tests in private labs in telangana

హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ల్యాబ్​లో నిర్వహించిన కరోనా పరీక్షల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. సదరు ల్యాబ్​లో నిర్వహించిన పరీక్షల్లో 71.7 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో ఆ గణాంకాలను పరిగణనలోకి తీసుకోబోమని సర్కారు స్పష్టం చేసింది.​

State government has been inept over the results of corona tests
కరోనా పరీక్షల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం అననుమానం
author img

By

Published : Jul 4, 2020, 5:12 AM IST

Updated : Jul 4, 2020, 6:19 AM IST

ప్రైవేటు ల్యాబుల్లో చేస్తున్న కరోనా పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం.. ఓ ల్యాబ్​లో చేసిన పరీక్షల్లో సుమారు 71.7 శాతం మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. సదరు ల్యాబ్​లో 3,726 నమూనాలను పరీక్షించగా 2,672 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది. ప్రైవేటు ల్యాబ్​ ఫలితాలను మరోసారి వైద్యారోగ్య శాఖ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో సదరు ల్యాబ్​ చేసిన పరీక్షల ఫలితాలను నిపుణుల కమిటీ పరిశీలించే వరకు ఆ గణాంకాలను పరిగణలోకి తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించింది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

Last Updated : Jul 4, 2020, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.