ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(financial year)కి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలతో బడ్జెట్(Telangana budget) ప్రవేశపెట్టింది. ఏకంగా 2.30 లక్షల కోట్ల పద్దును ప్రతిపాదించింది. కొవిడ్ రెండోదశతో... మళ్లీ గతేడాది తరహా పరిస్థితిని తీసుకొచ్చింది. వైరస్‌వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్(lockdown 2.0) విధించడం వల్ల.. ఆయారంగాల్లో కార్యకలాపాలు దాదాపుగా స్తంభించాయి. ప్రత్యేకించి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం(revenue income) బాగా తగ్గింది. ఏప్రిల్‌లో.. రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నుల ద్వారా 6వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. కేంద్రం నుంచి వెయ్యికోట్లకుపైగా నిధులొచ్చాయి.
ఏప్రిల్ నెల కార్యకలాపాలకు సంబంధించిన వాణిజ్యపన్నులు(commercial taxes), జీఎస్టీ(gst) ఆదాయం ఈనెలలో రానుడటంతో.. మేనెలలో కొంత మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. జూన్‌లో వచ్చే ఆదాయం బాగా తగ్గనుంది. ఇదే సమయంలో కరోనా(corona), బ్లాక్ ఫంగస్ చికిత్స(black fungus), ఔషధాలు, ఆక్సిజన్(oxygen), మౌలిక సదుపాయాలతోపాటు కోవిడ్ టీకాల(vaccination) కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యులు, సిబ్బందికి అదనపు వేతనాలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సివస్తుండటంతో వైద్యారోగ్యశాఖ వ్యయం భారీగాపెరగనుంది. లాక్‌డౌన్ అమలుతో.. హోంశాఖ వ్యయం పెరగనుంది. ఇదే సందర్భంలో కొన్ని ఇతర శాఖల ఖర్చులు తగ్గనున్న నేపథ్యంలో.. శాఖల కేటాయింపుల్లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) ఆదేశించారు.
సీఎం ఆదేశాలకు అనుగుణంగా.. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆ దిశగా కసరత్తు చేశారు. సర్కార్ ఆదాయం, శాఖలవారీగా అవసరాలపై దృష్టిసారించారు. వైద్యారోగ్య శాఖకు.... ఆదనంగా చేయాల్సిన కేటాయింపులపై చర్చించారు. ఇదేసమయంలో తప్పనిసరి చేయాల్సిన ఇతర వ్యయం, ఆదాయ వనరులపైనా సమీక్షించారు. వచ్చేనెలలో 7 వేల కోట్ల రైతుబంధు(rythubandu) నిధులు.. వారి వారి ఖాతాల్లో జమచేయాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. ప్రభుత్వం ఇప్పటికే రూ.5 వేల కోట్ల రుణం తీసుకొంది. వచ్చే నెలలోనూ మరికొంత అప్పు తీసుకోక తప్పనిసరి పరిస్థితి. ఆ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకొని కసరత్తు చేయనున్నారు. ఆ మేరకు శాఖల కేటాయింపుల్లో మార్పులు, చేర్పులపై మంత్రివర్గం(Telangana cabinet) చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
సంబంధిత కథనం: Telangana budget: బడ్జెట్ కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు