ETV Bharat / state

కార్పొరేటర్లు విప్​ ధిక్కరిస్తే అనర్హులవుతారు: ఎస్​ఈసీ

author img

By

Published : Feb 8, 2021, 10:23 PM IST

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం రాజకీయ పార్టీలు జారీ చేసిన విప్ ఉల్లంఘిస్తే.. వారు పదవిని కోల్పోతారని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. ఈనెల 11న జరిగే జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సమీక్ష నిర్వహించారు.

state election commissioner parthasaradhi review on ghmc mayor, deputy mayor election
కార్పొరేటర్లు విప్​ ధిక్కరిస్తే అనర్హులవుతారు: ఎస్​ఈసీ

ఈనెల 11న జరగనున్న జీహెచ్​ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్​​ ఎన్నికపై అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం రాజకీయ పార్టీలు జారీ చేసిన విప్ ఉల్లంఘిస్తే.. వారు పదవిని కోల్పోతారని.. వారు వేసిన ఓటు మాత్రం చెల్లుబాటవుతుందని వెల్లడించారు. 11న ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుందని... ప్రమాణం చేసిన వారికి మాత్రమే మధ్యాహ్నం 12.30కు జరిగే ప్రత్యేక సమావేశం, ఓటు వేసేందుకు అర్హత ఉంటుందని తెలిపారు.

ఎన్నికైన కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఎక్స్ అఫీసియో సభ్యులకు ఓటుహక్కు ఉంటుందని... చేతులెత్తడం ద్వారా ఈ ఓటింగ్ జరుగుతుందని వివరించారు. ఓటు హక్కు కల్గిన సభ్యుల్లో కనీసం సగం మందితో కోరం ఉంటేనే ఎన్నిక జరుగుతుందని... నిర్ణీత సమయానికి సరిపోయే సంఖ్యలో సభ్యులు హాజరైతే వెంటనే ఎన్నిక నిర్వహిస్తారు.

కోరం లేకపోయినా, ఏదైనా కారణాల వల్ల ఎన్నిక జరగకపోయినా మరుసటి రోజు ఎన్నిక నిర్వహిస్తారు. ఆ రోజు కూడా కోరం లేకపోతే ప్రిసైడింగ్ అధికారి ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. తదుపరి ఎస్ఈసీ నిర్ణయించే తేదీలో కోరం లేకపోయినా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. రాజకీయ పార్టీలు ఈ ఎన్నిక కోసం విప్ జారీ చేయవచ్చు.

ఇదీ చదవండి: జిల్లా, మండల పరిషత్​లకు నిధులు కేటాయిస్తాం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.