ETV Bharat / state

ఏపీ: గత నోటిఫికేషన్లన్నీ రద్దు చేయాలన్న విపక్షాలు - Election news in the AP

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సిందేనని విపక్ష పార్టీలు ముక్తకంఠంతో కోరారు. ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం, భాజపా, సీపీఐ సహా వివిధ పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి...కొత్తగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సూచించాయి.

sec
ఏపీ: గత నోటిఫికేషన్లన్నీ రద్దు చేయాలన్న విపక్షాలు
author img

By

Published : Oct 28, 2020, 1:28 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు... వివిధ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తున్న దృష్ట్యా....స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయం కోరింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.... వివిధ పార్టీల ప్రతినిధులతో విడివిడిగా భేటీ ఆయ్యారు. ఆ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

వైకాపాకు ఓటమి భయం: తెదేపా

గత ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి... కొత్త నోటిఫికేషన్ ద్వారా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కోరింది. గతంలో అధికారం అండతో వైకాపా బెదిరింపులకు పాల్పడి చేసుకున్న ఏకగ్రీవాలన్నీ రద్దు చేయాలని ఎస్ఈసీని కోరినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీలో ఎస్ఈసీకే భద్రత లేదన్న అచ్చెన్న.... ఇక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఎలా సాఫీగా జరుగుతాయన్నారు. కేంద్ర పోలీసు బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే ఎన్నికలు కావాలని గొడవ చేసిన వైకాపా...ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం సమావేశానికి రాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి..

భాజపా, సీపీఐ, బీఎస్పీ, జనతాదళ్‌ పార్టీలు సైతం పాత ఎన్నికలు నోటిఫికేషన్ రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. మళ్లీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు లిఖితపూర్వకంగా సూచించాయి. గతంలో అధికార పార్టీ అక్రమంగా ఏకగ్రీవాలు చేసుకున్న స్థానాలపైనా విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్‌ను పరిశీలించి...ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుంటే తక్షణం స్థానిక ఎన్నికలు నిర్వహించవచ్చని రామకృష్ణ వెల్లడించారు.

ఏపీలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టనందున...ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం స్పష్టం చేసింది. ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ ప్రతినిధులు ఎస్ఈసీని కోరారు. ముందు నుంచి ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్న అధికార పార్టీ వైకాపా మాత్రం ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉంది.

ఇదీ చూడండి: దుబ్బాక ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారు: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.