ఇవీ చూడండి :ఐటీగ్రిడ్స్ కేసు 20కి వాయిదా
అఖిలపక్షం నేతలతో ఎస్ఈసీ సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికలు, ఎన్నికల కోడ్ అమలు, మున్సిపల్ వార్డుల పునర్వవస్థీకరణ వంటి అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అఖిల పక్షం నేతలతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కమిషనర్ నాగిరెడ్డి అఖిల పక్షసమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులు, మున్సిపల్ వార్డుల పునర్వవస్థీకరణ వంటి అంశాలపై చర్చించారు. తుది ఓటర్ల జాబితా విడుదలయ్యాక కూడా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి ఎస్ఈసీని కోరారు. దొంగ ఓట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. స్థానిక సంస్థలఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించడం సాధ్యం కాదని తెరాస నేత గట్టు రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఏ ఎన్నికలైనా తెరాసదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి :ఐటీగ్రిడ్స్ కేసు 20కి వాయిదా
sample description