ETV Bharat / state

ఎస్​ఈసీ నియామకంలో ఏపీ ప్రభుత్వం ఏం చేసింది..?

author img

By

Published : May 29, 2020, 12:15 PM IST

ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని... ఏపీ ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించింది. పంచాయతీరాజ్ చట్టంలో ఎస్​ఈసీ నియామకానికి సంబంధించిన నిబంధనలను పూర్తిగా మార్చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఫలితంగా కమిషనర్​గా ఉన్న‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది. విశ్రాంత ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్​ను కొత్త ఎస్‌ఈసీగా గవర్నర్‌కు సిఫార్సు చేయగా.. వెనువెంటనే ఆయన ఆమోద ముద్ర వేశారు.

state-elaction-commissioner-nimmagadda-ramesh-kumar-issue
ఎస్​ఈసీ నియామకంలో ఏపీ ప్రభుత్వం ఏం చేసింది..?

ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు, నియామకం, వేతనం చెల్లింపు అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్-200లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. అందులోని వివరాలను పొందుపరుస్తూ జీవో-617 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు మాత్రమే ఎస్​ఈసీ పదవికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల పదవీకాలం మూడేళ్లకు కుదించిన ప్రభుత్వం... మూడేళ్ల పాటు ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన వారు మరో మూడేళ్లు కొనసాగే వెసులుబాటు కల్పించింది. ఆరేళ్లకు మించి పదవిలో కొనసాగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.

అంతా రహస్యంగానే...

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది. ఆర్డినెన్స్‌, నోటిఫికేషన్‌ ప్రకారం ఆయన పదవీకాలం ముగిసిందంటూ ఏపీ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి చేసిన సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. అన్నింటినీ అత్యంత రహస్యంగా ఉంచిన ప్రభుత్వం మీడియాలో విస్తృత ప్రచారం కావడం వల్ల బహిర్గతం చేసింది.

షార్ట్ సర్క్యులేషన్ మెథడ్​తో ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది. ఇందుకుగానూ మంత్రివర్గ ఆమోదం కోసం ఈనెల 7న పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రతిపాదన తయారు చేసి మంత్రులకు పంపారు. ఎవరి నుంచీ అభ్యంతరాలు లేకపోవటంతో ఆమోదం పొందినట్లు నిర్ధరించారు.

మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు సమయం లేకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా అనుసరించే ఈ పద్ధతిని 'షార్ట్ సర్కులేషన్ మెథడ్' అంటారు.

అనంతరం ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గవర్నర్‌ను కలిసి ఈ అంశాలను వివరించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, ఉత్తర్వుల జారీ చకాచకా జరిగిపోయాయి. ఇక కొత్త ఎస్​ఈసీగా పొరుగు రాష్ట్రానికి చెందిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ పేరును సూచిస్తూ... గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. వెంటనే ఆయన ఆమోదం తెలిపారు.

ఇవీ చదవండి: ఎస్‌ఈసీ ‘ఆర్డినెన్స్‌’పై నేడు హైకోర్టు తీర్పు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.