ETV Bharat / state

'నా మామ చావుకు కారణం ఆ ఎమ్మెల్యేనే'.. నెట్టింట వీడియో వైరల్​ - viral videos

ALLEGATIONS ON RAJAMPETA MLA: ఓ ఎమ్మెల్యే తనపై కేసులు పెట్టి వేధిస్తుండటంతో ఆవేదన చెందిన తన మామయ్య గుండెపోటుతో మరణించాడని ఓ వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు తన మామ సమాధి వద్ద సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇప్పడు ఆ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

ALLEGATIONS ON RAJAMPETA MLA
ALLEGATIONS ON RAJAMPETA MLA
author img

By

Published : Nov 12, 2022, 2:52 PM IST

"నా మామ చావుకు కారణం ఆ ఎమ్మెల్యేనే".. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్​

ALLEGATIONS ON RAJAMPETA MLA: ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తనపై కేసులు పెట్టించి వేధిస్తుండటంతో ఆవేదనతో తన మామ గుండెపోటుతో చనిపోయాడని సుండుపల్లి మండలానికి చెందిన సిద్ధార్థ గౌడ్ ఆరోపించారు. సుండుపల్లి మండలం దిన్నెల గ్రామానికి చెందిన సిద్ధార్థ గౌడ్.. రాష్ట్ర డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగిలో వివాహం చేసుకున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్​లో నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు స్వగ్రామమైన దిన్నెలకు వెళ్లివస్తుంటాడు. అందులో భాగంగానే ఇటీవల సుండుపల్లి మండలంలో ఓ జాతీయ నేత విగ్రహం.. మురికి కాల్వల మధ్య పడేసిన వైనాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి వైఖరిని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించాడు. ఎమ్మెల్యే పనితీరును ప్రశ్నిస్తూ పలుమార్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. దీంతో సిద్ధార్థ గౌడ్​పై నందలూరు, రాయచోటి, సుండుపల్లి, రాజంపేట పోలీస్​స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

అయితే ఈ కేసులన్నీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఒత్తిడితోనే నమోదయ్యాయని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ నెల 10న మామ కర్మదినం సందర్భంగా.. ఆయన సమాధి వద్ద సెల్ఫీ వీడియో, సాధారణ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తన మామ చావుకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డే కారణం అని సిద్ధార్థగౌడ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తన మామ చావుకు కారణమైన ఎమ్మెల్యేకు రాజకీయ సమాధి కడతానని శపథం చేస్తూ వీడియో పోస్టు చేశారు.

ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి.. నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని వీడియోలో ఆరోపించారు. ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.