ETV Bharat / state

విద్యుత్​ కొనకుండా అడ్డుపుల్ల.. నేడు అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్తు అందేనా..!

భారత ఇంధన ఎక్స్ఛేంజిలో రాష్ట్ర డిస్కంలు విద్యుత్‌ కొనకుండా అడ్డుపుల్ల పడింది. పాత బకాయిలు కట్టలేదని ఓ ప్రైవేటు సంస్థ ఎన్‌ఎల్‌డీసీకి నోటీసు ఇచ్చింది. దీంతో ఒక్కరోజుకు అవసరమైన విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా ఆదివారం అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్తు సరఫరా అవుతుందో లేదో సందేహాస్పదంగా మారింది.

విద్యుత్​ కొనకుండా అడ్డుపుల్ల.. నేడు అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్తు అందేనా..!
విద్యుత్​ కొనకుండా అడ్డుపుల్ల.. నేడు అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్తు అందేనా..!
author img

By

Published : Apr 17, 2022, 4:53 AM IST

తెలంగాణలో ఆదివారం అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్తు సరఫరా అవుతుందో లేదో సందేహాస్పదంగా మారింది. ఒక్కరోజుకు అవసరమైన విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో లోటును సర్దుబాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదివారం అవసరాలకు 40 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్తును భారత ఇంధన ఎక్స్ఛేంజి (ఐఈఎక్స్‌)లో కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు శనివారం ప్రయత్నించాయి. కానీ ఓ జాతీయస్థాయి ప్రైవేటు సంస్థ పేరు చెప్పి ‘జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రం’ (ఎన్‌ఎల్‌డీసీ) కొనుగోలుకు అడ్డుపుల్ల వేసింది. విద్యుత్‌ కొనాలంటే ఒకరోజు ముందే డబ్బు చెల్లించాలి. ఆ మేరకు డిస్కంలు శనివారం మధ్యాహ్నం 12.30లోగా ఐఈఎక్స్‌లో డబ్బు చెల్లించడానికి సిద్ధమయ్యాయి. కానీ తెలంగాణ డిస్కంల నుంచి డబ్బు, కరెంటుకు ఆర్డర్‌ తీసుకోవద్దని ఎన్‌ఎల్‌డీసీ చెప్పడంతో ఐఈఎక్స్‌ విద్యుత్తు విక్రయానికి నిరాకరించింది.

సౌరవిద్యుత్‌ బకాయిలు కట్టలేదని...

ప్రముఖ ప్రైవేటు సంస్థకు చెందిన రెండు సౌర విద్యుత్​ కేంద్రాల నుంచి తెలంగాణ డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.147 కోట్ల పాత బకాయిలున్నాయి. ఈ సొమ్ము చెల్లించనందున తెలంగాణ డిస్కంలను ఎగవేతదారు (డిఫాల్టర్‌) జాబితాలో పెట్టి ఐఈఎక్స్‌లో విద్యుత్తు కొనకుండా అడ్డుకోవాలని సదరు సంస్థ ఎన్‌ఎల్‌డీసీకి నోటీసు ఇచ్చింది. దీంతో డిస్కంల నుంచి ఐఈఎక్స్‌ డబ్బు తీసుకోలేదు. కానీ శనివారం ఉదయమే తాము బకాయిలన్నీ చెల్లించినందున నోటీసును ఉపసంహరించుకోవాలని ప్రైవేటు సంస్థ అధికారులకు ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు శనివారం మధ్యాహ్నం 12.30 వరకూ పలుమార్లు ఫోన్‌ చేసి అడిగారు. అయినా వారు స్పందించలేదు. ఎట్టకేలకు మధ్యాహ్నం ఒకటిన్నరకు నోటీసును ఉపసంహరించుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కానీ 12.30కే విద్యుత్తు కొనుగోలు సమయం ముగియడంతో ట్రాన్స్‌కో, డిస్కంలు నిరుత్సాహానికి గురయ్యాయి. ముందే డబ్బు చెల్లించి, స్వయంగా ఫోన్‌ చేసి చెప్పినా ఆలస్యంగా స్పందించడం వెనుక రాష్ట్రంలో నిరంతర విద్యుత్తును అడ్డుకోవాలన్న వ్యూహం ఏమైనా ఉందా లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా అని ట్రాన్స్‌కో, డిస్కంలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఎత్తిపోతలకు కరెంటు నిలిపివేత..

ఐఈఎక్స్‌లో విద్యుత్తు కొనలేకపోవడంతో ఆదివారం సరఫరా నియంత్రణపై డిస్కంలు దృష్టి పెట్టాయి. వ్యవసాయానికి ఒకటి లేదా రెండు గంటల కోత అనివార్యమవుతుందని ప్రాథమిక అంచనా. కాళేశ్వరం సహా అన్ని ఎత్తిపోతల పథకాలకు శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ విద్యుత్తును తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల కనీసం 10 ఎంయూల వాడకం తగ్గుతుందని అంచనా. కార్యాలయాలు, పరిశ్రమలకు సెలవే కనుక, మరికొంత విద్యుత్తు ఆదా అవుతుందని లెక్కలుగట్టారు. కొత్తగూడెంలో 800 మెగావాట్ల 7వ దశ విద్యుత్​ కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేంద్రంలో తలెత్తిన చిన్న సాంకేతిక లోపాన్ని ఎలాగైనా సరిదిద్ది, ఆదివారం సాయంత్రం వరకూ విద్యుదుత్పత్తి కొనసాగించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

నిరంతర సరఫరాకు ప్రయత్నాలు..

ట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్తు సరఫరాకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం. గత నెల రోజుల్లో ఐఈఎక్స్‌కు రూ.2029 కోట్లు చెల్లించి విద్యుత్తు అంతరాయాలు లేకుండా చూశాం. అయినా కొందరు కావాలనే తెలంగాణలో నిరంతర విద్యుత్తు సరఫరా జరగకుండా చూడాలని అడ్డుపుల్లలు వేయడం బాధాకరం. వరి పొలాలకు ఇంకా బోర్ల నుంచి నీరు పెడుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండు 13 వేల మెగావాట్ల వరకూ ఉంటున్నందున ఐఈఎక్స్‌లో అధిక ధర చెల్లించి కొంటున్నాం. యూనిట్‌కు గరిష్ఠంగా రూ.12 చొప్పున చెల్లించి కొనడానికి శనివారం బిడ్‌ వేసినా.. అది మనకు రాకుండా అడ్డుకున్నారు.-డి. ప్రభాకరరావు, ట్రాన్స్‌కో- జెన్‌కో సీఎండీ

ఇవీ చూడండి..

నేటి నుంచి యథావిధిగా 24 గంటల విద్యుత్ సరఫరా

'దుబాయ్‌లో నగలు అమ్ముకున్న ఇమ్రాన్‌'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.