ETV Bharat / state

బడ్జెట్​కు కేబినెట్ ఆమోదం.. సోమవారం ప్రవేశపెట్టనున్న హరీశ్ రావు - వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్

State Cabinet Meeting Update: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది. వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించిన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

kcr
kcr
author img

By

Published : Feb 5, 2023, 11:05 AM IST

Updated : Feb 5, 2023, 10:57 PM IST

State Cabinet Meeting Today Update: ప్రగతి భవన్​లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సమావేశంలో చర్చలు జరిపారు. రేపు అసెంబ్లీలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. మంత్రివర్గ సమావేశం ముగియడంతో సీఎం కేసీఆర్ నాందేడ్ బయలుదేరి వెళ్లనున్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను మంత్రివర్గం ఆమోదించింది. బడ్జెట్ ప్రతిపాదనలను సమావేశంలో ఆర్థికశాఖ అధికారులు వివరించారు. ఆదాయ, వ్యయాల వివరాలను సమర్పించారు. బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వ ప్రాధాన్యాలు, నిధుల కేటాయింపు, తదితరాలకు సంబంధించి మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. నాలుగు కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వరంగల్​లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 1200 కోట్లు... హైదరాబాద్​లోని మూడు ఆసుపత్రుల నిర్మాణం కోసం 2800 కోట్ల రూపాయలు అప్పు ద్వారా సమీకరించుకోనున్నారు.

భద్రాచలం, సారపాక, రాజంపేట గ్రామపంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పురపాలికలుగా మార్చాలన్న ప్రతిపాదనలకు ట్రైబర్ అడ్వైజరీ కౌన్సిల్ అనుమతించకపోవడంతో తిరిగి మళ్లీ పంచాయతీలుగానే కొనసాగించాలని నిర్ణయించారు. మూడు గ్రామపంచాయతీలుగా భద్రాచలం, రెండు పంచాయతీలుగా సారపాకను విభజించారు. రాజంపేట గ్రామపంచాయతీగా కొనసాగనుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ గతంలోనే ఉత్తర్వు జారీ చేయగా... మంత్రివర్గం ఇవాళ ఆమోదముద్ర వేసింది. అటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానంగా చేసిన ప్రసంగం చాలా బాగుందని మంత్రులు, అధికారులు మంత్రి కేటీఆర్​ను అభినందించారు.

ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ దఫాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఎన్నికల కోణంలో మరోమారు భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం కొనసాగుతోంది. మొదటి తొమ్మిది నెలల ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం ఉన్న మొత్తం, తదితరాలను బేరీజు వేసుకొని.. రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తీసుకురానున్నారు. ప్రస్తుతం నడుస్తున్న 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాతో రూ.2 లక్షలా 52 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది లక్షా 93 వేల 29 కోట్ల రెవెన్యూ రాబడులు అంచనా వేయగా.. డిసెంబర్ చివరి నాటికి అంచనాలకు అనుగుణంగానే ఖజానాకు సమకూరాయి.

ఇవీ చదవండి:

Last Updated : Feb 5, 2023, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.