ETV Bharat / state

పద్దుకు వేళాయే: శాసనసభలో కేసీఆర్.. మండలిలో హరీశ్​​.. - రాష్ట్ర బడ్జెట్​

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్​ నేడు ఉభయ సభల ముందుకు రానుంది. శాసనసభలో సీఎం కేసీఆర్​, మండలిలో ఆర్థిక మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.30 గంటలకు సమావేశాలు ప్రారంభమైన వెంటనే నేరుగా బడ్జెట్​ను ప్రవేశపెడతారు. కేవలం బడ్జెట్​ ప్రతిపాదనకు మాత్రమే  నేటి సమావేశాలు పరిమితమవుతాయి.

రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్​
author img

By

Published : Sep 9, 2019, 5:09 AM IST

Updated : Sep 9, 2019, 7:28 AM IST

పద్దుకు వేళాయే... శాసనసభలో కేసీఆర్.. మండలిలో హరీశ్​​

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్​ ఇవాళ ఉభయసభల ముందుకు రానుంది. శాసనసభలో సీఎం కేసీఆర్​, మండలిలో ఆర్థిక మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ భేటీ కానున్న ఉభయసభల సభా వ్యవహారాల సలహా సంఘాలు ఈ సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేయనున్నాయి.

ఉదయం 11.30 నిమిషాలకు...

ఫిబ్రవరి నెలలో జరిగిన బడ్జెట్​ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. ఆర్నెళ్ల కాలానికి నిధులు ఖర్చు చేసేందుకు అసెంబ్లీ, మండలి అనుమతి తీసుకుంది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, మండలి సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది. ఉభయసభలు ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే నేరుగా బడ్జెట్​ను ప్రవేశపెడతారు. అయితే కేవలం బడ్జెట్​ ప్రతిపాదనకు మాత్రమే నేటి సమావేశాలు పరిమితమవుతాయి. అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి.

పూర్తి స్థాయి ఎజెండా ఖరారు

బడ్జెట్​ సమావేశాల పూర్తి స్థాయి ఎజెండా నేడు ఖరారు కానుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలి అన్న విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం శాసనసభ, మండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశమవుతాయి.

కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం

ఈ బడ్జెట్​ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పురపాలక చట్ట ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు సహా మరికొన్ని బిల్లులను ప్రవేశపెడతారు. కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పెడతామని గతంలో ప్రకటించినా... దీనికి సంబంధించిన కసరత్తు ఇంకా ప్రారంభం కాని నేపథ్యంలో సర్కారు ఏం చేస్తుందన్న దానిపై అస్పష్టత నెలకొంది.

మండలి అధ్యక్ష పదవికి నామినేషన్లు

మరోవైపు శాసనమండలి అధ్యక్ష పదవి కోసం ఇవాళ నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. మండలి ఛైర్మన్​గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 11న ఎన్నిక చేపడతారు. ప్రస్తుతం మండలిలో బలాబలాల దృష్ట్యా తెరాస అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

ఇదీ చూడండి : బడ్జెట్​ సమావేశాలకు అసెంబ్లీ ముస్తాబు

Intro:tg_kmm_13_08_gurupujostavam_ab_ts10044

( )

ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయుల కాపాడాలని ఖమ్మం జెడ్పి చైర్మన్ కమల్ రాజు విజ్ఞప్తి చేశారు. సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు . జిల్లాలో ఎంపిక చేసిన 25 మంది ఉపాధ్యాయులను శాలువా కప్పి సన్మానం చేశారు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో లో ఎం ఎల్ ఏ ఉపేందర్ రెడ్డి మేయర్ పాపాలాల్ డీఈఓ మదన్మోహన్ పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థుల స్వాగత నృత్యాలు అలరించాయి....byte
byte... కమల్ రాజు జడ్పీ చైర్మన్

Body:గురుపూజోత్సవం

Conclusion:గురుపూజోత్సవం
Last Updated : Sep 9, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.