రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామంటూ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం పర్యటన పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రాజెక్టు కింద గత రెండేళ్లుగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తులో దర్శనీయ స్థలం అవుతుందేతప్ప... ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని.. కేసీఆర్ ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని హితవు పలికారు.
కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన డీపీఆర్‌లో కేవలం 17.50లక్షల ఎకరాలు మాత్రమే వివరించారని తెలిపారు. కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లిస్తామని లక్ష కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు మూడో టీఎంసీ అంటూ కొత్త ముచ్చట చెబుతున్నారని విమర్శించారు. కేంద్ర జలవనరుల శాఖ డీపీఆర్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డీపీఆర్‌ను కేంద్రం ముందు పెట్టాలని... ఆ విషయంలో ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనను ప్రజల ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు.
ఇదీ చూడండి: సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం: సీఎం కేసీఆర్