ETV Bharat / state

ప్రైవేటు వైద్య సిబ్బందికీ టీకా పంపిణీ ప్రారంభం - ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న లక్షకుపైగా సిబ్బందికి టీకాలను అందించగా.. ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికీ వ్యాక్సిన్‌‌ పంపిణీ మొదలైంది.

Started covid vaccine distribution to private medical staff in state
ప్రైవేటు వైద్య సిబ్బందికీ టీకా పంపిణీ ప్రారంభం
author img

By

Published : Jan 26, 2021, 9:10 AM IST

Updated : Jan 26, 2021, 11:16 AM IST

రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బందికే కొవిడ్‌ టీకాలను అందిస్తుండగా, నిన్నటి నుంచి ప్రభుత్వం.. ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికీ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు.. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్‌లో టీకాల‌ పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా మెడికల్ ఆఫీసర్ స్వరాజ్యలక్ష్మి ప్రారంభించారు.

వ్యాక్సిన్‌ పంపిణీ నుంచి గర్భిణీలు, బాలింతలను మినహాయించినట్లు స్వరాజ్యలక్ష్మి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 700 ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా సెంటర్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 6900మంది హెల్త్ సిబ్బంది ఉండగా.. అందులో 4270మందికి ఇప్పటికే వ్యాక్సిన్‌‌ అందినట్లు వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా మెడికల్ ఆఫీసర్ స్వరాజ్యలక్ష్మి

ముందుగా జిల్లా వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, మెడికల్, పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్‌ను అందిస్తున్నామని స్వరాజ్యలక్ష్మి తెలిపారు. అనంతరం సామాన్య ప్రజలకూ టీకాలను పంపిణీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: టీకాపై వస్తున్న వదంతులు నమ్మొద్దు: ఎమ్మెల్యే

Last Updated : Jan 26, 2021, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.