ETV Bharat / state

REGISTRATION DEPT INCOME: కాసుల వర్షం కురిపిస్తోన్న రిజిస్ట్రేషన్ శాఖ

author img

By

Published : Feb 8, 2022, 2:46 AM IST

Updated : Feb 8, 2022, 7:21 AM IST

TELANGANA STAMPS, REGISTRATION DEPT: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అనూహ్యంగా పెరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏటికేడు పెరుగుతూ వస్తున్న రాబడులు ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటికే పదివేల కోట్లు దాటగా.... మార్చి చివరినాటికి మరో రెండున్నరవేల కోట్లు ఆదాయం వస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది.

REGISTRATION DEPT INCOME
REGISTRATION DEPT INCOME
కాసుల వర్షం కురిపిస్తోన్న రిజిస్ట్రేషన్ శాఖ

STAMPS, REGISTRATION DEPT COLLECTIONS: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు పెరిగినట్లుగా రిజిస్ట్రేషన్ ఆదాయమూ పెరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటితో పోల్చితే.... ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వస్తున్న ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ శాఖకు కేవలం 2వేల 745కోట్ల రాబడి వచ్చింది. 2015-16 ఆర్థిక ఏడాదిలో 10లక్షల52 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్(DOCUMENT REGISTRATION) అయ్యి.... 3వేల786 కోట్ల ఆదాయం వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 10లక్షల63వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి 4వేల249 కోట్ల రూపాయల రాబడులు వచ్చాయి. 2017-18లో 11లక్షల50వేల రిజిస్ట్రేషన్లతో 5వేల177 కోట్లు సమకూరాయి. 2018-19లో 15లక్షల 32 వేల రిజిస్ట్రేషన్లతో 6వేల 612 కోట్ల రాబడి వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 16లక్షల 58వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా.....7వేల61 కోట్లు ఆదాయం ఖజానాకు చేరింది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

2020-21 ఆర్థిక సంవత్సరం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా పదివేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కరోనా ఉద్ధృతితో నిర్దేశించిన లక్ష్యాన్ని ఆరు వేల కోట్లకు ప్రభుత్వం సవరించింది. అయినా ఆశించిన మేర రాబడి లేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10లక్షల76వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కాగా...5వేల260 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఇప్పుడు నడుస్తున్న 2021-22 ఆర్థిక ఏడాదిలో... గడిచిన పదినెలల్లో 10 లక్షలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి...9వేల843 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

గడిచిన ఆరు రోజుల్లో..

జూలైలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూములు, ఆస్తుల విలువలను ప్రభుత్వం పెంచింది. ఈ నెలలో మళ్లీ వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు సర్కారు పెంచింది. గడిచిన ఆరు రోజుల్లో...ప్రతి రోజు 5 వేలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతూ 45నుంచి 50కోట్లకు తక్కువ లేకుండా ఆదాయం వస్తున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ చెబుతోంది.

పెరిగిన రిజిస్ట్రేషన్ విలువలతో సర్కారు ఖజానాకు మరింత ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: CM KCR Yadadri Visit: యాదాద్రిలో కేసీఆర్​ పర్యటన.. పునర్నిర్మాణ పనులపై దిశానిర్దేశం..

Last Updated : Feb 8, 2022, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.