ETV Bharat / state

Registration department: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన మరింత జాప్యం! - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ(Registration department) ప్రక్షాళన ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. అస్తవ్యస్త వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు, తమిళనాడు, మహారాష్ట్రాల్లోల్లాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖను బలోపేతం చేసే దిశలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినా ఫైలు కదలడం లేదు. రిజిస్ట్రేషన్‌ల సంఖ్య అధికంగా ఉండడం వల్ల కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు పని ఒత్తిడికి గురవుతుండగా... మరికొందరు చేసేందుకు పనిలేక కాలక్షేపం చేయాల్సి వస్తోంది. త్వరితగతిన ఈ శాఖ ప్రక్షాళన పూర్తయితే... పని విభజన జరిగి, అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంది.

Registration department, registrations in telangana
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన, తెలంగాణలో రిజిస్ట్రేషన్లు
author img

By

Published : Sep 1, 2021, 1:03 PM IST

రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ(Registration department) ప్రక్షాళన ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను ప్రక్షాళన చేయడం ద్వారా పని విభజన జరిగి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాబడులు పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన నివేదికను గతేడాదే అందజేసింది. అంతకు ముందు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన అధికారుల బృందం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి... అక్కడ రిజిస్ట్రేషన్‌ శాఖల పనితీరుపై అధ్యయనం చేసింది. కర్ణాటక రాష్ట్రం కంటే కూడా తమిళనాడు, మహారాష్ట్రల్లో రిజిస్ట్రేషన్‌ శాఖల పనితీరు, అవి అనుసరిస్తున్న విధానాలు మెరుగ్గా ఉన్నాయని... తద్వారా ప్రభుత్వాలకు ఆదాయం కూడా భారీగా సమకూరుతున్నట్లు గుర్తించింది. మహారాష్ట్రలో అయితే నాన్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం ద్వారా ఏకంగా రూ.15వేల కోట్లు వస్తుండగా తెలంగాణాలో కేవలం రూ.800 కోట్లు వస్తోందని ఓ అధికారి తెలిపారు.

గతేడాదే నివేదిక

అక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అవినీతికి తావులేకుండా సమర్థవంతంగా పని చేయడానికి చక్కటి పర్యవేక్షణ యంత్రాంగం కూడా ఉన్నట్లు ఆ బృందం తేల్చింది. ప్రధానంగా రిజిస్ట్రేషన్ల రద్దీ ఆధారంగా అక్కడ అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్లకు వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పూర్తయ్యేట్లు చూస్తున్నట్లు గుర్తించింది. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఉండాలని, శాఖాపరంగా నూతన విధానాలు అమలుకు ప్రత్యేక విభాగం, నాన్‌ రిజిస్ట్రేషన్‌ ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ... ముందుకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక విభాగం ఇలా పని విభజన జరగడం వల్ల అధికారులపై పని భారం తగ్గడమే కాకుండా పారదర్శకత పెరిగి ప్రభుత్వానికి రాబడులు పెరుగుతాయని ఉన్నతాధికారుల బృందం అంచనా వేసింది. ఆ మూడు రాష్ట్రాల్లో పర్యటించిన ఉన్నతాధికారుల బృందం... అందులో మన రాష్ట్రంలో అమలు చేయడానికి అవకాశం ఉన్న అంశాలను పొందుపరచి ఏడాది కింద ఓ నివేదికను ప్రభుత్వానికి నివేదించింది.

అధికారుల కసరత్తు

రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ పునర్‌వ్యవస్థీకరణ కొత్త రెవెన్యూ చట్టం అమలుకు అనుగుణంగా ఉండేలా ఉన్నత స్థాయిలో ఏడాది కిందటే కసరత్తు జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో అధికారుల బృందం ఇచ్చిన నివేదికపై స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష కూడా జరిగింది. 2019-20 ఆర్థిక ఏడాదిలో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు, తద్వారా వచ్చిన రాబడిని దృష్టిలో ఉంచుకుని ఈ కసరత్తు జరిగింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా రిజిస్ట్రేషన్ల సంఖ్య, అక్కడ వస్తున్న రెవెన్యూ, పని చేస్తున్న సిబ్బంది తదితర వివరాలను తెప్పించుకుని సోమేశ్‌కుమార్‌ సమీక్ష చేశారు. వాస్తవానికి కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రావడంతో... వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ అంతా రెవెన్యూ పరిధిలోకి వెళ్లింది. 2019-20 ఆర్థిక ఏడాదిలో 16.58లక్షలు రిజిస్ట్రేషన్లు జరగగా... అందులో నాలుగున్నర లక్షలు వ్యవసాయ భూములకు చెందిన రిజిస్ట్రేషన్లుగా గుర్తించి వాటిని రెవెన్యూ అధికారులకు బదలాయింపు చేశారు. మరో 12 లక్షలు మాత్రమే వ్యవసాయేతర భూములు, ఆస్తులకు చెందిన రిజిస్ట్రేషన్లు మిగిలాయి.

రిజిస్ట్రేషన్లపై సమీక్ష

రాష్ట్రంలో 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా వాటిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగిన తీరును గణాంకాలు ద్వారా పరిశీలించారు. అదేవిధంగా ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది సంఖ్య, వస్తున్న ఆదాయం వివరాలపై కూడా సమీక్ష చేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అధికంగా జరుగుతూ... వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కడెక్కడ తక్కువ జరుగుతున్నాయో గుర్తించారు. మరోవైపు రాష్ట్రంలో ఏయే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలల్లో అధిక సంఖ్యలో వ్యవసాయేతర ఆస్తులు, భూములు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నయో కూడా లెక్క తేల్చారు. అదే విధంగా జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఏర్పాటు చేయాల్సి వస్తే ఎక్కడెక్కడ అవసరం ఉంది? ఆడిట్‌కు చెందిన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉండాలి తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు సీఎస్‌కు నివేదించారు. కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నెలకు అయిదు వందల నుంచి వెయ్యి కూడా రిజిస్ట్రేషన్లు జరగకపోగా... మరికొన్నింటిలో 35వేల నుంచి 40వేల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు గుర్తించారు. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్న సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఎక్కువగా హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉన్నాయి.

కార్యాలయాల ప్రక్షాళన

రిజిస్ట్రేషన్ల శాఖ ప్రాథమికంగా ప్రతిపాదించిన నివేదిక ఆధారంగా ఎత్తివేసేందుకు అవకాశం ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు 23 నుంచి 25 వరకు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాద్‌లో ఖానాపూర్‌, బోథ్‌, లక్షెట్టిపేట... నిజామాబాద్‌లో బిచ్కుంద, దోమకొండ... మహబూబ్‌నగర్‌లో అలంపూర్‌, మరొకటి... వరంగల్‌లో కొడకండ్ల, స్టేషన్‌ ఘనపూర్‌, ములుగు, వర్ధన్నపేట... ఖమ్మంలో బూర్గంపాడు, ఇల్లెందు, కల్లూరు... కరీంనగర్‌లో తిమ్మాపూర్‌, మల్యాల... నల్గొండలో నిడమనూరు, చండూరు, మోత్కూరు, రామన్నపేట... సిద్దిపేట రూరల్‌, జోగిపేట, నర్సాపూర్‌, హుస్నాబాద్‌లు ఉన్నట్లు తెలిసింది. ఇక అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూ రద్దీ ఎక్కువగా ఉండే చోట్లు అదనంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అందులో మంచిర్యాలల్లో ఒకటి, వరంగంల్‌ జిల్లాలో ఒకటి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకటి, సంగారెడ్డి జిల్లాలో పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌లలో కొత్తగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాధించినట్లు తెలిసింది. ఇవి కాకుండా ఎక్కువ ఒత్తిడి, అధిక ఆదాయం ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అధికంగా అదనపు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ మాదిరిగా ఈ శాఖ కూడా పునర్‌వ్యవస్థీకరణ పూర్తయితే శాఖ పనితీరు మెరుగుపడి ఆదాయం కూడా పెరుగుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు అభిప్రాపడుతున్నారు.

ఇదీ చదవండి: Campus Placements: ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్​మెంట్స్.. వారికే ఫస్ట్ ప్రిపరెన్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.