హైదరాబాద్‌లో స్థిరాస్తి క్రయవిక్రయాలు గడిచిన ఆరు నెలల్లో స్తబ్దుగా ఉన్నట్లు నైట్‌ప్రాంక్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశ వ్యాప్తంగా స్థిరాస్థి వ్యాపార స్థితిగతులపై ఓ నివేదికను ఆ సంస్థ హైదరాబాద్‌లో విడుదల చేసింది. దేశంలో స్థిరాస్తి క్రయవిక్రయాలు పెరిగినట్లు తెలిపింది. నిర్మాణ ప్రారంభోత్సవాల్లో తీసుకుంటే... దేశంలో అత్యధికంగా కోలకత్తాలో 90శాతం పెరుగుదలతో మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ 47శాతంతో రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
వాణిజ్యంలో హైదరాబాద్ ఫస్ట్
క్రయవిక్రయాల్లో దేశ రాజధానిలో 10శాతం పెరగగా... బెంగుళూరులో 9 శాతం పెరిగినట్లు వివరించింది. వాణిజ్య సముదాయాల నిర్మాణాల్లో హైదరాబాద్ 129శాతం వృద్దితో మొదటి స్థానంలో ఉండగా 107శాతం వృద్ధితో బెంగుళూరు రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. రంగాల వారీగా చూస్తే 35శాతంతో ఐటీ రంగం మొదటి స్థానంలో ఉండగా తయారీ రంగం 12శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 13శాతం, ఇతర రంగాలు 40శాతం లెక్కన వాణిజ్య సముదాయాలను తీసుకున్నాయి.
ఇవీ చూడండి: గావ్ కనెక్షన్ నివేదికలో అన్నదాత ఆవేదన!