SHAR : ఏపీలోని తిరుపతి జిల్లాలో గల సతీశ్‌ధావన్ స్పేస్‌సెంటర్ నుంచి చేపట్టనున్న చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గురువారం రిహార్సల్స్ నిర్వహించిన శాస్త్రవేత్తలు.. రాకెట్ పనితీరు బాగుందని నిర్ధారించుకున్నారు. అనంతరం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో రాకెట్ సన్నద్ధత సమావేశం జరిగింది. సాయంత్రం భాస్కర కాన్ఫరెన్సు హాలులో లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశం నిర్వహించిన తర్వాత ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం వేకువజామున 2.48 గంటలకు ప్రారంభం కాగా.. ఉదయం 6.30 గంటల వరకు కొనసాగింది. ఉదయం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2) నింగిలోకి బయలుదేరనుంది.
ఈ ప్రయోగంలో మూడు ఉపగ్రహలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. అందలో ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు ఉండే ఈవోఎస్-07 ఉపగ్రహం. దీనితో పాటు అమెరికలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1 ఉపగ్రహం. చెన్నై స్పేస్‌కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ఉపగ్రహలను భూసమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ ప్రయోగం 15 నిమిషాల్లో పూర్తికానుంది. 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్-07, 880 సెకన్లకు జానుస్-1, చివరగా 900 సెకన్లకు ఆజాదీశాట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
ఇవీ చదవండి :