ETV Bharat / state

పది ఫలితాల విడుదలకు మరిన్ని జాగ్రత్తలు

ఇంటర్ ఫలితాల్లో జరిగిన గందరగోళంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విద్యా శాఖ... పదో తరగతి ఫలితాల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావచ్చినందున.. ఫలితాల వెల్లడి ప్రక్రియపై రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి సమీక్ష జరిపారు.

పది ఫలితాలు
author img

By

Published : May 4, 2019, 12:16 AM IST

ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో పదో తరగతి ఫలితాల వెల్లడికి ముందే పలు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. మూల్యాంనక ప్రక్రియ పూర్తి కావచ్చినందున.. ఫలితాల వెల్లడి ప్రక్రియపై రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఫలితాల్లో ఒక్క తప్పు కూడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయ్ కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుధాకర్, సిబ్బందికి జనార్దన్ రెడ్డి సూచించారు.

పది ఫలితాల విడుదలకు మరిన్ని జాగ్రత్తలు

'0' మార్కులు కనిపిస్తే మళ్లీ పరిశీలన...

అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనప్పటికీ... ఒక్క సబ్జెక్టు గైర్హాజరు లేదా సున్నా మార్కులు కనిపించిన వాటిని పునపరిశీలించాలని నిర్ణయించారు. సబ్జెక్టుల వారీగా మార్కుల్లో తేడాను క్షుణ్ణంగా విశ్లేషించాలన్నారు. అన్ని సబ్జెక్టుల్లో సుమారు 90 మార్కులు వచ్చి... ఒక సబ్జెక్టులో మాత్రం చాలా తక్కువ మార్కులు వస్తే ఆ సమాధాన పత్రాన్ని మళ్లీ పరిశీలించాలని నిర్ణయించారు.

అభ్యంతరాల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు...

ఫలితాలను తెలుసుకోవడానికి వెబ్​సైట్​లో ప్రత్యేక లింకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పరీక్షలు, ఫలితాలకు సంబంధించి విద్యార్థుల అభ్యంతరాలను ఆన్​లైన్ ద్వారా వేగంగా పరిష్కరించేందుకు పరీక్షల విభాగంలో ఏర్పాట్లు చేయనున్నారు. తప్పులు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకొని... వచ్చే వారంలో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి : మొదటి విడత ఎంసెట్​ ప్రశాంతం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.