కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయంలో... సుమారు 4 లక్షల 3 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు... జూరాల నుంచి కూడా శ్రీశైలానికి వరద వచ్చి చేరుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 5 లక్షల 32 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఔట్‌ఫ్లో 3 లక్షల 48 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 12 గేట్లలో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 2 లక్షల 43 వేల 171 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా..... ప్రస్తుతం 202.96 టీఎంసీలుగా ఉంది.
ఇవీ చూడండి;బీఆర్కే భవన్‌కు తరలిన సచివాలయం