శ్రీరామ నవమి సందర్భంగా సికింద్రాబాద్ తాడ్‌బండ్ లోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి దంపతులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేడుకకు ఆలయాన్ని రకరకాల పూలు, పళ్లతో అలంకరించారు. ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ పరిసరాలు పులకించాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇవీ చూడండి: వీడియో తీశారు... రిమాండ్కు వెళ్లారు...