ETV Bharat / state

Srinivasa Goud Election Affidavit Tampering Case : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక కేసులో ఏం చేద్దాం.. దిల్లీలో ఈసీ మల్లగుల్లాలు

Srinivasa Goud Election Controversy : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంలో కేసు నమోదు అంశం ఈసీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏకంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​పైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తదుపరి ఏం చేయాలన్న విషయమై ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గత రెండు రోజులుగా హస్తినలో ఉండి సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు.

Srinivasa Goud Election Affidavit Tampering Case
Srinivasa Goud Election Controversy
author img

By

Published : Aug 16, 2023, 10:30 PM IST

Srinivasa Goud Election Affidavit Tampering Case Update : ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్​గౌడ్ ​సహా 11మందిపై మహబూబ్​నగర్​ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండో పట్టణ పోలీస్​స్టేషన్​లో 21 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్​లో (FIR) పేర్కొన్నారు. అయితే ఇందులో ఏకంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner of India) రాజీవ్ కుమార్​పైన కూడా కేసు నమోదైంది.

సీఈసీతో పాటు సీఈసీ కార్యదర్శి సంజయ్ కుమార్, గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్, రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఐఏఎస్ అధికారి వెంకట్రావు, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, అప్పటి ఆర్డీఓ శ్రీనివాస్, ఐటీ బృంద సభ్యుడు వెంకటేష్ గౌడ్, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సుధాకర్​లపై కేసు నమోదు చేశారు. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలోనూ కీలక అంశంగా మారింది. ఈ తరహాలో ఏకంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​పైనే కేసు నమోదు కావడం ఇదే మొదటి సందర్భంగా చెబుతున్నారు.

Srinivas Goud Election Affidavit Tampering Controversy Case Update : ఎన్నికల అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌ వివాదం.. మంత్రి శ్రీనివాస్​గౌడ్​పై కేసు నమోదు

Srinivasa Goud Election Controversy Case on CEC : దీంతో తదుపరి ఏం చేయాలన్న విషయమై ఈసీ(EC) కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్ రెండు రోజుల క్రితం దిల్లీ వెళ్లారు. కేసు వ్యవహారంపైనే సీఈఓ హస్తిన వెళ్లినట్లు సమాచారం. కేసు పూర్వాపరాలు, ఇతర అంశాలపై వికాస్​రాజ్​తో సీఈసీ చర్చిస్తున్నట్లు సమాచారం. రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సీఈసీపై ఈ తరహా కేసు నమోదు కావడాన్ని చిన్న విషయం కాదని అంటున్నారు.

దీంతో కేంద్ర ఎన్నికల సంఘం (central election commission) ఈ అంశాన్ని సీరియస్​గానే తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న విషయమై ఈసీ దృష్టి సారించినట్లు తెలిసింది. న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలి.. ఏం చేయాలన్న విషయమై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అటు సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ కూడా సీఈఓ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. తదుపరి ఏం చేయాలన్న విషయమై ఆరా తీస్తున్నారు.

Supreme court on Vanama Petition : సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే

Srinivasa Goud Election Controversy : మంత్రి శ్రీనివాస్​గౌడ్​ 2018లో ఎన్నికల అఫిడవిట్​ సమర్పించినప్పుడు తన​ ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని సీహెచ్​ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్​ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

'కేంద్ర సంస్థల దాడులను సమర్థంగా ఎదుర్కొంటాం.. భయపడే ప్రసక్తే లేదు'

Voter Registration Training Program : 'ఒకే కుటుంబ సభ్యుల ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం లో ఉండే విధంగా చూడాలి.. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి'

ఈసీ నియామకాల కొత్త బిల్లులో ట్విస్ట్​​.. ప్రధాని నేతృత్వంలోని కమిటీకి 'సూపర్ పవర్​'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.