Srinivas Goud in Victims Of Gymkhana Ground: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. టికెట్ల కోసం జరిగిన ఘర్షణలో గాయపడ్డ బాధితులకు, పోలీసు ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో బాధితులను శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. వారితో కలిసి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులో మంత్రి బయలుదేరారు. ఈరోజు జరిగే మ్యాచ్ను శ్రీనివాస్ గౌడ్ బాధితులతో కలిసి వీక్షించనున్నారు.
అసలేెం జరిగిదంటే: టీ-ట్వంటీ మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో.. సికింద్రాబాద్ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజుల నుంచే భారీగా అభిమానులు తరలివస్తున్నారు. హెచ్‌సీఏ టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతోందంటూ ఆందోళనలు చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్ఆర్సీలో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో ఆఫ్లైన్లో టికెట్లు ఇస్తామని హెచ్‌సీఏ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
చాలా మంది తరలివస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్ గేట్ ద్వారా ఒక్కసారిగా అభిమానులు తోసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి.
హెచ్‌సీఏ పెద్దల తీరుపై పోలీసుఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది వస్తారనే అంచనా ఉన్నప్పటికీ కనీస చర్యలు చేపట్టలేదని ఆక్షేపిస్తున్నారు. అజరుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఎస్‌ఐ ప్రమోద్ ఫిర్యాదుతో 420, 21,22/76 పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. టికెట్ల నిర్వహణతో పాటు వాటిని బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపణలపై ఫిర్యాదు నమోదు అయింది. తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యం వహించడమే కారణమని చికిత్స పొందుతున్నవారు చెబుతున్నారు. వారి ఫిర్యాదుతో బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: హెచ్‌సీఏపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్... అజారుద్దీన్ రియాక్షన్ ఏంటంటే?
'ఇక్కడి నాయకులు ఫార్మా కంపెనీ యాజమాన్యాలకు అమ్ముడుపోయారు'
'థర్డ్ ఫ్రంట్ లేదు.. కాంగ్రెస్తో కలిసి ఒకటే కూటమి'.. తేల్చేసిన నీతీశ్