ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు కొనసాగుతునే ఉన్నాయి. స్వామి, అమ్మవార్లకు గ్రహణకాల అభిషేకాలు చేశారు. రాహు,కేతు పూజలను నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఆలయం లోపల ఊరేగించారు.
ఆలయ దర్శనానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ... ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. సూర్యగ్రహణంతో దేశంలోని ఆలయాలన్నీ మూతపడినా.. గ్రహణ గండాలకు అతీతమైన శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని మాత్రం.. ఎప్పటిమాదిరే తెరిచి ఉంచారు.
ఇదీ చూడండి : ద్వార బంధనంలో భద్రాద్రి రామయ్య సన్నిధి