శ్రీరామ నవమిని పురస్కరించుకుని ముషీరాబాద్‌లోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణుల వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండువగా కల్యాణాన్ని జరిపించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో భక్తులు... ఈ ఉత్సవాల్లో పాల్గొనలేదు. స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్ బెస్త, ఆలయ ఛైర్‌పర్సన్, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆ సొరంగంలో నడిస్తే కరోనా వైరస్ హతం