ETV Bharat / state

Sputnik vaccine: హైదరాబాద్‌ చేరిన 30లక్షల స్పుత్నిక్‌-వి డోసులు - ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్​లో హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు

రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాలు హైదరాబాద్​ చేరుకున్నాయి. 56.6 టన్నుల వ్యాక్సిన్లు ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ ద్వారా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోకు వచ్చాయి. ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చిన వాటిల్లో ఇదే అతిపెద్ద దిగుమతి అని అధికారులు చెబుతున్నారు.​

sputhnic v vaccines arrived ghac
జీహెచ్ఏసీకి చేరుకున్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు
author img

By

Published : Jun 1, 2021, 1:20 PM IST

దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్‌ దిగుమతులకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో(జీహెచ్‌ఏసీ) వేదికైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాలు హైదరాబాద్​ చేరుకున్నాయి. మూడో విడతలో మరో 27.9లక్షల టీకా డోసులు దిగుమతి అయ్యాయి. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ RU-9450 విమానం ఈ టీకాలు తీసుకుని ఇవాళ తెల్లవారుజామున 3.43 గంటల ప్రాంతంలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గోకు చేరుకుంది. 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ టీకాలను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు తరలించారు.

స్పుత్నిక్‌ టీకా సరఫరాలో అతిపెద్ద దిగుమతి ఇదే. అంతకుముందు తొలి విడతలో 1.5లక్షల టీకాలు, రెండో విడతలో 60వేల డోసులను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు మొత్తం 30లక్షల డోసులు భారత్‌కు చేరుకున్నట్లయింది. జూన్‌లో మరో 50లక్షల డోసులను పంపిస్తామని రష్యా ఇదివరకే వెల్లడించింది. జూన్‌ రెండోవారం నుంచి స్పుత్నిక్ వి టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు.

అతిపెద్ద వ్యాక్సిన్‌ దిగుమతి ఇదే..

ఇప్పటివరకు భారతదేశానికి వచ్చిన కొవిడ్ వ్యాక్సిన్లలో అతిపెద్ద దిగుమతి ఇదే. భారతదేశంతో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా జీహెచ్‌ఏసీ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుందని ఎయిర్‌కార్గో తెలిపింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ప్రధాన ఫార్మా కంపెనీలు 3.5 బిలియన్ల డోసుల వివిధ రకాల కొవిడ్‌ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లేదా దిగుమతి చేసుకుంటాయని చెప్పింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల దిగుమతిని సజావుగా నిర్వహించేందుకు అన్ని వనరులను సమకూర్చుకుంటున్నట్లు పేర్కొంది.

ఎయిర్‌కార్గోలో టెంపరేచర్ కంట్రోల్డ్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని, టెర్మినల్ నుంచి విమానానికి సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి టెంపరేచర్ కంట్రోల్డ్ ‘కూల్ డాలీ’ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. దీని వల్ల ట్రక్కు ఆఫ్‌లోడింగ్ పాయింట్ నుంచి విమానం లోడింగ్ వరకు వ్యాక్సిన్లు, ఔషధాల ఎలాంటి ఆటంకాలూ లేని కోల్డ్ చెయిన్ సదుపాయాలను అందిస్తోంది. తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుందని పేర్కొంది. వ్యాక్సిన్లను సజావుగా నిర్వహించేందుకు తాము వనరులనూ సమకూర్చుకుంటున్నట్టు పేర్కొంది.

ఇదీ చదవండి : Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.