ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 21న కౌన్సిలింగ్ నిర్వహించనుంది. రెండు విడతల కౌన్సిలింగ్ ముగిసిందని.. మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. సీటు పొందిన విద్యార్థులు వెంటనే నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.
రిజర్వేషన్ నియమ నిబంధనల ప్రకారం.. సీట్ల కేటాయింపు ఉంటుందని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. సీట్ల లభ్యత, ఫీజు వివరాలు వంటి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.pjtsau.edu.in లో చూడవచ్చని రిజిస్ట్రార్ సూచించారు.