రాష్ట్రంలో క్రీడా సదుపాయాల కల్పనతో పాటు క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్... ఎంతో కృషి చేస్తున్నారని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో హాకీ క్రీడా అభివృద్ధిపై తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్ లో హాకీ లీగ్స్‌ను ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో హాకీ క్రీడాకారులతో కమిటీ వేస్తే హాకీ అభివృద్ధి చెందుతుందని సూచించారు. అస్తవ్యస్తంగా ఉన్న తెలంగాణ హాకీ అసోసియేషన్‌ను 5 మెన్ కమిటీగా నియమించి సరిదిద్దాలని మంత్రి ఆదేశించారు. 33 జిల్లాల్లో కూడా హాకీ కమిటీలను వేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు సరళ్ తల్వార్‌ను ఆదేశించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య