హైదరాబాద్ పంజాగుట్టలో దారుణ హత్యకు గురైన వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి విజయవాడలో ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. హత్య జరగడానికి ముందు రాంప్రసాద్‌ను కొందరు వెంటాడినట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై కత్తితో దాడి చేసిన అనంతరం వారు కారులో పరారైనట్లు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.
డీజీపీ అసంతృప్తి
దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస హత్యలు పట్ల డీజీపీ మహేందర్‌రెడ్డి... పోలీస్‌స్టేషన్ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఠాణాకు ఆకస్మికంగా వచ్చారు. వ్యాపారి రాంప్రసాద్ హత్య తదనంతర పరిణామాలపై ఆరా తీశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నిందితులను ఎందుకు పట్టుకోలేదని దర్యాప్తు అధికారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డీజీపీతోపాటు సీపీ అంజనీకుమార్ రెండున్నర గంటల పాటు స్టేషన్లోనే ఉన్నారు.
ఇవీ చూడండి: కర్నాటకం: కాంగ్రెస్-జేడీఎస్ నేతల భేటీ