Election Campaigners Demand in Telangana : 'మా పనిమనిషి నాలుగు రోజులుగా రావడం లేదు. మా వాచ్‌మన్ వాళ్లు వారం రోజుల కిందటే ఊరికి వెళ్లారు. అవునండి మా ఇంట్లో పని చేసే మనిషి కూడా పది రోజులుగా సరిగ్గా రావడం లేదు..' నగరాల్లో, పట్టణాల్లోని పలు బహుళ అంతస్తులు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రస్తుతం ఇదే ముచ్చట నడుస్తోంది. అభ్యర్థుల వెంట ప్రచారానికి తిరిగే వారికి అధిక డబ్బులు ఇస్తుండటంతో పని మనుషులు అటువైవు వరుస కడుతున్నారు. అంతేకాదు.. ఒక గ్రూప్‌గా ఏర్పడి మరీ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం చేసి వస్తున్నారు.
ఓటరన్నా ఈసారి నీ ఓటు రేటెంతా - నీ లీడర్ ఇచ్చే చీప్‌లిక్కర్ రేటంతేనా?
రాష్ట్రంలో పార్టీల ఎన్నికల (Telangana Elections 2023) ప్రచారం తారస్థాయికి చేరింది. వివిధ పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి ప్రచారం చేయడానికి వరుస కడుతున్నారు. రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. దీంతో నగరాలు, పట్టణాలలో ప్రచారానికి అభ్యర్థులకు కార్యకర్తలు దొరకడం లేదు. ఈ క్రమంలో ఇళ్లలో పనులు చేసే వారిని ప్రచారానికి తీసుకువెళుతున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారి వెంట వీరూ ప్రచారానికి సై అంటున్నారు. నెలంతా చేసే పనికి వచ్చే డబ్బులు.. నాలుగైదు రోజుల్లోనే వస్తున్నాయి కాబట్టి.. ప్రచారం ముగిసేదాక మీరే ఎలాగైనా సర్దుకోండని కొందరు తమ యజమానులను బతిమిలాడుతున్నారు. కొందరైతే ఈ పని కాకపోతే మరోకటి దొరకదా అంటూ పని మానేసి.. ప్రచారానికి వెళ్తున్నారు.
ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం
Speed up in Election Campaign in Telangana : ప్రస్తుతం కాలనీలు, వార్డుల్లో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి జట్టులో అభ్యర్థి బంధువులు, కీలక అనుచరులు ముందుండి నడిపిస్తున్నారు. వారి వెనుక కార్యకర్తలు నడుస్తున్నారు. జెండాలు మోయడానికి, ఇళ్ల తలుపులపై పార్టీ స్టిక్కర్లు అతికించడానికి, ప్రహరీలకు జెండాలు కట్టడానికి మనుషులను బాడుగకు తీసుకుంటున్నారు. ఇలా ఒక్కొదానికి మనుషులను నియమించుకొని పకడ్బందీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా తాయిలాల పంపిణీపై అభ్యర్థుల ఫోకస్ - ఓటర్లు కోరినవీ కోరనివి అన్నీ ఇచ్చేస్తున్నారుగా
Election Campaigners Charges in Telangana : హయత్‌నగర్, ఎల్బీ నగర్, కర్మన్ఘట్, ఉప్పల్, మేడిపల్లి, ఘట్‌కేసర్, మేడ్చల్, రసూల్‌పుర తదితర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది పార్టీల ప్రచారానికి వెళుతున్నారు. వీరిలో 10-20 మంది కలిసి ఒక జట్టుగా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండేసి గంటల ప్రచారానికి ఒక్కొక్కరికి రూ.600, ఒక బిర్యాని ప్యాకెట్, శీతల పానీయం సీసా ఇచ్చి పంపిస్తున్నారు. పొద్దంతా ప్రచారమైతే రూ.1000, చికెన్ కూర భోజనం పెడుతున్నారు. రానుపోను రావాణ సౌకర్యము కూడా కల్పిస్తున్నారు. దీంతో ఇళ్ల కాపలాదారులు, సెక్యూరిటీలు, పని మనుషులు ప్రచారానికి వరుస కడుతున్నారు.
చివరి వారమంతా తెలంగాణలోనే అగ్రనేతలు - ఆఖరి ఘట్టంలో ప్రచారాన్ని హోరెత్తించనున్న ప్రధాన పార్టీలు
ఎన్నికల వేళ కాయ్ రాజా కాయ్ - గెలుపు గుర్రాల మీద జోరుగా బెట్టింగులు