ETV Bharat / state

Statue Of Equality: కళ్లు చెదిరే నిర్మాణ చాతుర్యం.. కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక కార్యక్రమం - pm hyderabad visit

Statue Of Equality: గొప్ప సంకల్పంతో కనీవినీ ఎరుగని భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం..! కళ్లు చెదిరే అపురూప నిర్మాణాలు... 108 ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహాం..! ఎటు చూసినా.. ఏం చేసినా... తొమ్మిది అనే అంకెతో ముడిపడే నిర్మాణ చాతుర్యం..! ముచ్చింతల్‌కు సమీపంలోని శ్రీరామ నగరం నిత్యం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంతో దివ్యక్షేత్రమంతా మార్మోగుతోంది. దివ్య సాకేతంలో రామానుజుల విగ్రహంతో పాటే... 108 దివ్య దేశాల్ని నిర్మించారు.

Statue Of Equality
Statue Of Equality
author img

By

Published : Feb 5, 2022, 5:30 AM IST

Statue Of Equality: కళ్లు చెదిరే నిర్మాణం.. కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక కార్యక్రమం

Statue Of Equality: హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని 45 ఎకరాల విస్తీర్ణంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. సుమారు 12 వేల కోట్ల రూపాయాలు వెచ్చించి ఆరేళ్లపాటు వేల మంది శిల్పులు, నిర్మాణరంగ నిపుణులు శ్రమించి శ్రీరామకేంద్రానికి తుదిరూపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న భంగిమల్లో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో సమతా మూర్తి విగ్రహం రెండోది కావడం విశేషం. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. గర్భగుడిలో స్తంభాలపై చెక్కిన శిల్పాలు అలరిస్తున్నాయి. మహా విగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా కనిపిస్తారు.

25 కోట్ల రూపాయలతో..

శ్రీరామనగరం దివ్యక్షేత్రంలోకి అడుగుపెట్టగానే పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు 25 కోట్ల రూపాయలతో 45 అడుగుల ఎత్తయిన ఫౌంటెయిన్‌ స్వాగతం పలుకుతోంది. రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపించేలా నిర్మాణం చేశారు. ఈ మహోన్నత క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సుమారు 1,200 మంది శిల్పులు, ఇతర చేతివృత్తి కళాకారులు శ్రమించారు. రామానుజుల జీవిత విశేషాలు ప్రతిబింబించేలా మ్యూజియం, ఉద్యాన వనాలు ఆకట్టుకుంటున్నాయి.

తొమ్మిది సంఖ్య వచ్చే విధంగా..

సమతామూర్తి విగ్రహాన్ని వివిధ కోణాల్లో చూస్తే.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మం 27 అడుగులు ఉంటుంది. పద్మపీఠం త్రిదళాలు 3 వరసల్లో నిర్మాణం చేశారు. ఒక వరసకు 36 చొప్పున మొత్తం 108 ఉంటాయి. చుట్టూ ఏనుగు విగ్రహాలు 9 ఏర్పాటు చేశారు. రామానుజుల ఒక కన్ను 4.5 అడుగులు ఉంటుంది. 2 కన్నులు కలిపి 9 అడుగులు ఉంటాయి. వాటర్ ఫౌంటెన్ 36 అడుగులు, పైకి ఎక్కే మెట్లు తొమ్మిదింటిని ఏర్పాటు చేశారు. శ్రీరామానుజచార్యుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. దివ్య దేశాలుగా భావించే 108 పుణ్య క్షేత్రాలు ఏర్పాటు చేశారు. అన్నీ కలిపితే 9 సంఖ్య వస్తుంది. 144 యాగశాలలు, 1,035 హోమగుండాలు ఏర్పాటు చేశారు. అవి కూడా మొత్తం కలిపితే 9 అవుతుంది.

నిత్యం కోటి సార్లు అష్టాక్షరీ మంత్ర జపం..

12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 144 యాగశాలల్లో విశ్వశాంతి కోసం సహస్ర కుండాత్మక మహావిష్ణు యాగం చేస్తున్నారు. వేడుకలు జరిగే రోజుల్లో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపించడం ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతోంది. హోమంలో పలు రాష్ట్రాల నుంచి సేకరించిన 2 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నారు. ఆవు పేడతో తయారు చేసిన కట్టెలు, శ్రేష్ఠమైన రావి, జువ్వి, మేడి, మామిడి కట్టెలతో సహస్ర కుండాత్మక యాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీటి నుంచి వచ్చే పొగ బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

సమతామూర్తికి ఘనమైన గుర్తింపునిచ్చేందుకు..

వైష్ణవ తత్వాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు కృషి చేస్తోన్న ఆశ్రమం.. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన రామానుజచార్యులకు ఆకాశమంత గౌరవం కల్పించేందుకు సిద్ధమైంది. వెయ్యేళ్ల క్రితమే సమాజంలోని అందరూ సమానమే అంటూ.. సమతా భావనను అనుసరించిన మహా పురుషుడికి ఘనమైన గుర్తింపునిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆశ్రమంలోని ఏ మూలనుంచి చూసినా... అంతా సమానమే అంటూ మౌనంగా బోధ చేస్తున్నట్లుగా రామానుజచార్యులు కనిపిస్తున్నారు. దివ్య సాకేతంలో రామానుజుల విగ్రహంతో పాటే... 108 దివ్య దేశాల్ని నిర్మించారు. ప్రముఖ వైష్ణవాలయాల నమూనాల తయారీ కోసం దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న వెయ్యి మంది శిల్పులు 14 నెలలు శ్రమించి మనకు అందించారు. సమతామూర్తి కేంద్రం ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, గోపురాలను ప్రాచీన చోళ, పల్లవ శైలిలో నిర్మించారు.

మరో వెయ్యేళ్లు వర్ధిల్లుతాయి..

చరిత్రలో నిలిచిపోయే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో.. రామానుజచార్యుల బోధనలు మరో వెయ్యేళ్లు వర్ధిల్లుతాయని చినజీయర్‌ స్వామి అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీచూడండి:

Modi Visit Statue of Equality: శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం

Ramanuja Sahasrabdi Utsav : కన్నుల పండువగా రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.