తిరుపతి, నాందేడ్, విజయవాడ, నాగర్సోల్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రదేశాలకు ప్రయాణికుల తాకిడి ఎక్కువ. వీటితో పాటు రాయచూర్, కృష్ణరాజపురం, కాకినాడ, విశాఖపట్నం, పూణే వంటి పట్టణాలకు కూడా ప్రత్యేక రైళ్లను నడపనుంది. బరౌని, రక్ సాల్, దర్భంగా, జయపుర, టాటానగర్ వంటి దూర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల మీదుగా వెళ్తాయి.
ప్రత్యేక కోచ్‌లతో పాటు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ఏసీ తరగతులకు డిమాండ్ ఎక్కువ. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధారణ ఇంటర్ సిటీ రైళ్లకు అదనపు ఏసీ ఛైర్ కోచ్‌లను జతచేసేందుకు రైల్వే శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఆన్లైన్ సేవలను వినియోగించుకుంటే...రైల్వేస్టేషన్ వరకు వెళ్లి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక రైళ్లకు సాధారణ టికెట్ ధరలనే నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. రద్దీకి అనుగుణంగా మరిన్నీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు.