ETV Bharat / state

వినియోగదారుల హక్కులేంటి? చట్టాలేం చెబుతున్నాయి?

మార్కెట్‌కు వెళ్తాం. సరిపడ సరకులు కొంటాం. డబ్బులు చెల్లిస్తాం. వచ్చేస్తాం. రసీదు సంగతి ఏమిటి? చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. కొందరు దుకాణాదారులు.. రసీదు రాయటం మొదలు పెట్టినా...సమయం వృథా అని హడావుడిగా వచ్చేస్తారు వినియోగదారులు. తరవాత తెచ్చిన సరకుల్లో ఏదైనా నకిలీ అని తేలితే.. ఆ దుకాణాదారుని ప్రశ్నించినా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని సమయాల్లో దుకాణాదారులే రసీదులు ఇవ్వటం లేదు. ఈ విషయమై కొన్న ... అమ్మిన వారి మధ్య గొడవలు జరిగిన సందర్భాలెన్నో. కొనే ప్రతివస్తువులో లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. భారీ మోసాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మోసపోయిన సందర్భాల్లో చేసే న్యాయపోరాటంలో అవగాహనే అస్త్రమవుతుంది.

వినియోగదారుల హక్కులేంటి? చట్టాలేం చెబుతున్నాయి?
వినియోగదారుల హక్కులేంటి? చట్టాలేం చెబుతున్నాయి?
author img

By

Published : Mar 17, 2021, 10:35 AM IST

వినియోగదారుల హక్కులేంటి? చట్టాలేం చెబుతున్నాయి?

నల్గొండకు చెందిన ఒక మహిళ 2018లో ఆర్టీసీ బస్సులో హెదరాబాద్‌కు పెళ్లికి బయలు దేరింది. బస్సు మెట్ల వద్ద చిన్నరేకు పైకి తేలి ఉండటం వల్ల ఆమె కట్టుకున్న పట్టుచీర చిరిగి పోయింది. డ్రైవర్‌కు చెప్పినా పట్టించుకోలేదు. పెళ్లి వేడుకలో బంధుమిత్రులు పదేపదే గురించే ప్రశ్నించడం వల్ల ఆమె కొంత ఇబ్బంది పడ్డారు. ఆ మహిళ తనకు పరిహారం ఇవ్వాలని ఆర్టీసీ పై వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. ఫోరం వారు విచారించి ఆర్టీసీకి 3 వేల రూపాయల జరిమానా విధించారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకుంటే.. ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలియజేసే ఉదంతమిది. నష్టపోయిన ఆ మహిళ.. మనకెందుకులే అని ఊరుకుంటే...ఇప్పుడీ ప్రస్తావన వచ్చేదే కాదు. వినియోగదారులకు కల్పించిన హక్కే ఆమెకు పరిహారం అందేలా చేసింది.

హక్కులేంటి..?

ఇంతకీ వినియోగదారుల హక్కులేంటి..? దుకాణాదారు ఏదైనా నాసిరకం వస్తువు అమ్మిన సందర్భంలో...సరైన ఫోరమ్‌ను ఆశ్రయించి న్యాయం పొందటం...వినియోగదారుల హక్కుల్లో మొదటిది. మోసపూరిత వ్యాపారం కారణంగా నష్టపోతే...పరిహారం కోరే హక్కు ఉంటుంది. ఇందుకు సంబంధించి సరైన అవగాహన పొందే హక్కు కూడా ఉంటుంది. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారం తెలుసు కోవచ్చు. ఆస్తి, ప్రాణనష్టం కలిగించే వస్తువులను మార్కెటింగ్‌ చేసే వారి నుంచి తమను తాము రక్షించుకునే హక్కు కూడా ఇందులో భాగమే.

చట్టాలేం చెబుతున్నాయి?

వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 1986లో ప్రవేశపెట్టారు. ఇది 1987 డిసెంబర్‌ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం చేసినప్పుడు సూపర్‌ మార్కెట్లు పెద్దగా లేవు. ఇ-కామర్స్‌, టెలీ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, మల్టీలెవెల్‌ మార్కెటింగ్‌, విపణుల డిజిటలీకరణ లేదు. రాష్ట్రాలు, దేశాల మధ్య ఇంత భారీ ఎత్తున వస్తుసేవల అమ్మకాలు, కొనుగోళ్లు...ఇవేమీ లేవు. అందువల్ల వీటికి సంబంధించి సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలో చట్టం స్పష్టంగా నిర్దేశించలేకపోయింది. అందుకే..1986 నాటి వినియోగదారుల చట్టం స్థానంలో కొత్తది తేవడానికి భారతప్రభుత్వం పార్లమెంటులో ఓ బిల్లు ప్రవేశపెట్టింది. దశాబ్దాల నాటి వినియోగదారుల రక్షణ చట్టం-1986 స్థానంలో 2020 జులై నుంచి కొత్త చట్టం విధివిధానాలు అమలులోకి వచ్చాయి.

వినియోగదారుల సాధికారత

ఈ చట్టంలో వినియోగదారుల హక్కులను కాపాడటం, అనైతిక వ్యాపారాలను అరికట్టడం, సత్వర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ రూపొందించడం వంటి అంశాలున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ క్రయవిక్రయాలు, విక్రయ సంస్థల్ని చేర్చి చట్ట పరిధిని పెంచారు. వినియోగదారుల సాధికారతను కాపాడటంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతోంది కేంద్రం. ఈ చట్టం కింద కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం ఈ సంస్థకు సోదాలు, జప్తు చేసే అధికారం ఉంది. అనైతిక వ్యాపారం కొనసాగిస్తూ హక్కులకు భంగం కలిగిస్తున్నట్లు ఫిర్యాదు అందితే కలెక్టరు ద్వారా నివేదిక కోరవచ్చు. హక్కుల పరిరక్షణ కోసం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయవచ్చు.

ఎంతవరకు అవగాహన?

కొత్త చట్టంలో జిల్లా కమిషన్‌ పరిధి కోటి రూపాయల వరకు, రాష్ట్ర కమిషన్‌ పరిధి కోటి నుంచి 10కోట్లకు, జాతీయ కమిషన్‌ 10కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన కేసులను చేపట్టేలా కీలక మార్పులు చేశారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చేవారిని, అటువంటి ప్రకటనల్లో భాగస్వాములైన వ్యక్తులకు 10 లక్షల వరకు జరిమానా విధించే అధికారం కేంద్ర ప్రాధికార సంస్థకు ఉంది. అదే విధంగా మోసపూరిత ప్రకటనలో పాల్గొన్న ప్రముఖులపై ఇతర వాణిజ్య ప్రకటనల్లో నటించకుండా ఏడాది నుంచి మూడేళ్ల వరకు నిషేధం విధించవచ్చు. జిల్లా స్థాయి కమిషన్‌లో కొత్తగా వివాదాల పరిష్కార కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు నెలకొల్పి సత్వర పరిష్కారం కల్పించే అవకాశాన్ని కొత్త చట్టం కల్పిస్తోంది. పరిష్కారం లభించని పక్షంలో జిల్లా స్థాయి కమిషన్‌ రాష్ట్ర, జాతీయ కమిషన్లకు నివేదిక పంపాల్సి ఉంటుంది.

హక్కుల ఉల్లంఘన జరిగితే ?

నూతన వినియోగదారు చట్టంలో ఆన్‌లైన్‌ ఫిర్యాదును స్వీకరించిన 48 గంటల్లో గుర్తించి... నెలలోగా పరిష్కారాన్ని నిర్దేశించారు. వ్యాపార ప్రకటనల ఒప్పందాలు, ఉత్పత్తి జవాబుదారీతనం వంటి అంశాలతో మార్పులు చేయడం వినియోగదారుడికి మేలు కలిగించే పరిణామం. ఈ చట్టంలో వినియోగదారుల హక్కులు, వివాద పరిష్కార ప్రక్రియను స్పష్టంగా పేర్కొనడం, ఫిర్యాదులను ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాతిపదికన పరిష్కరించే వీలు కల్పించడం లాంటి కీలక సంస్కరణలున్నాయి. వస్తువులు, సేవల లోపంతో వినియోగదారుడి హక్కుల ఉల్లంఘన జరిగితే సంబంధిత సంస్థలు, విక్రయదారులతో పాటు తయారీదారులూ బాధ్యత వహించేలా నిబంధనలు రూపొందించారు. గతంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు...ఆ వస్తువు కొన్న ప్రాంతంలోనే కేసు వేయాల్సి ఉండేది. ఇది ఎక్కువమంది వినియోగదారుల చైతన్యానికి అడ్డుపడే విధంగా ఉందని 2019లో చట్టంలో సరిచేశారు. వస్తువు ఎక్కడ కొన్నా తాము ఉండే ప్రాంతంలో కేసు వేసుకునేలా చట్టాన్ని సవరించారు.

90రోజుల్లో పరిష్కారం

వినియోగదారుడు వేసే కేసు నిజాయతీతో కూడుకున్నదై ఉండాలి. నష్టపోయినప్పుడే కేసు వేయాలి. వినియోగదారుల ఫోరాలలో బాధితులు వేసిన కేసు 90రోజుల్లో పరిష్కరిస్తారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు సరైన విధంగా అందకపోయినా... బీమా కంపెనీలు పాలసీ డబ్బులు సరైన సమయంలో ఇవ్వకపోయినా... జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. మానసిక వేదనకు గురి చేసే ఇలాంటి సంస్థలపై ఈ కమిషన్‌ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వినియోగదారుడు..నేరుగా జిల్లా కమిషన్‌ను ఆశ్రయించకుండా... యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. పరిష్కారం లభించకపోతే... ఇప్పుడు జిల్లా కమిషన్‌ను సంప్రదించాలి. కేసును స్వయంగా ఫిర్యాదుదారే వాదించుకునే వెసులుబాటు కల్పించారు. లేదా సొంత ఖర్చులతో న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: పసుపు బోర్డు ఆశలపై కేంద్రం నీళ్లు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.