ETV Bharat / state

TRS Vs BJP: భాజపా, తెరాస మధ్య రాష్ట్రంలో రాజకీయ కాక - modi

TRS Vs BJP: భాజపా, తెరాస మధ్య రాష్ట్రంలో రాజకీయ కాక మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు దూకుడు పెంచుతున్నారు. వరుస ఆందోళనలు, పోరాటాలతో తెరాస సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బండి సంజయ్‌ అరెస్ట్‌తో ఏకంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రావడం.. ఆంక్షలున్నాయని అడ్డుచెప్పినా హైదరాబాద్‌ అడ్డాలో పంతం నెగ్గించుకున్నారు.

భాజపా, తెరాస మధ్య రాష్ట్రంలో రాజకీయ కాక
భాజపా, తెరాస మధ్య రాష్ట్రంలో రాజకీయ కాక
author img

By

Published : Jan 5, 2022, 2:00 PM IST

TRS Vs BJP: సై అంటే.. సై.. మాటకు మాట.. ట్వీట్‌కు ట్వీట్‌.. దేనికైనా రెడీ అన్నట్లుగా భాజపా-తెరాస మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ అవతరణ, కొత్త రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలతో పాటు పెద్దగా రాజకీయ వైరానికి దిగిన ఘటనలు లేవు. సీఎం కేసీఆర్​ కేంద్రానికి అంశాలవారీగాను మద్దతు తెలిపారు. రెండోసారి కేసీఆర్​ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ పరిణామాలు క్రమంగా మారుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత దూరం మరింత పెరుగుతోంది. గులాబీ పార్టీకి చేదు గుళిక రుచిచూపించిన కమలనాథులు క్రమంగా పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ చెప్పుకోదగిన సీట్లు రాబట్టి తెరాసకు ముచ్చెమటలు పట్టించారు. ఆ తర్వాత హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పరాభవం చవిచూసినప్పటికీ.. పడిలేచిన కెరటంలా పైకిలేచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక రావడం.. ఈటల రాజేందర్‌ వంటి బలమైన నాయకుడు భాజపా తీర్థం పుచ్చుకోవడంతో కమలనాథుల్లో జోష్‌ మరింత పెంచింది. తెరాస ప్రభుత్వం అస్త్రశస్త్రాలెన్ని వాడినా ఈటల జయకేతనం ఎగురవేయడం భాజపా నేతల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఇదే ఊపును వచ్చే ఎన్నికల నాటికీ కొనసాగించాలని భావిస్తున్న భాజపా అధిష్టానం.. తెరాస సర్కార్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్ర నేతలకు పచ్చజెండా ఊపింది.

అక్కడ మొదలైన మాటల వేడి...

telangana politics: వరిధాన్యంతో మొదలైన మాటల వేడి ఉద్యోగుల బదిలీలు, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యల వంటి అంశాలతో మరింత వేడెక్కింది. ధాన్యం సేకరణ అంశంపై దాదాపు నెలకుపైగా హైడ్రామా నడిచింది. రాష్ట్ర మంత్రులు దిల్లీకి వెళ్లడం.. పోటాపోటీగా రాష్ట్ర భాజపా నేతలు కేంద్రమంత్రి పీయూశ్‌ గోయల్‌ను కలవడం వాతావరణాన్ని మరింత కాక పుట్టించాయి. కేంద్రం తీరును ఎండగట్టే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ నేతృత్వంలో ఇందిరాపార్క్‌ వద్ద వరిదీక్షకు దిగడం.. ఆ తర్వాత ఊరూరా భాజపాకు చావు డప్పు మోగించడం మరింత మంటపుట్టించాయి. ఈ పరిణామాలన్నీ దిల్లీకి చేరాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్‌ సహా ముఖ్యనేతలు.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాష్ట్రంలో పరిస్థితులు తెలిపారు. వివరాలన్నీ తెలుసుకున్న నడ్డా.. తెరాస సర్కార్‌పై చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. ఇదే ఉత్సాహంతో ఎదుర్కోవాలని సూచించారు. బండి సంజయ్‌ పాదయాత్రను అభినందిస్తూ అలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఉద్భోదించారు. అవసరమైతే తాను కూడా రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. అమిత్‌ షా సైతం రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పోరాడాలని భాజపా నేతలకు దిశానిర్దేశం చేశారు. అధిష్టానం సంకేతాలతో రంగంలోకి దిగిన భాజపా నేతలు ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు, నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలపై పోరాటాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో బండి సంజయ్‌ జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసిన తీరు భాజపాకు తీవ్ర అగ్రహం తెప్పించింది. పార్టీ కార్యాలయం తలుపులు బద్ధలు కొట్టి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం కమలనాథులకు ఆక్రోషం తెప్పించింది.

బండి దీక్ష భగ్నం.. మరింత ముదిరిన లొల్లి

Bandi sanjay arrest: బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించడం.. ఆ తర్వాత పరిణామాలపై ఆరా తీసిన భాజపా అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. 14 రోజుల పాటు నిరసన చేపట్టాలనే నిర్ణయంలో భాగంగా.. జేపీ నడ్డా స్వయంగా హైదరాబాద్‌కు వచ్చారు. కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.కొవిడ్‌ ఆంక్షల దృష్టి అనుమతి నిరాకరించిన పోలీసులు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా చర్యలు చేపట్టారు. శంషాబాద్‌ విమానాశ్రయంలోనే జేపీ నడ్డాను నిలువరించే ప్రయత్నం చేశారు. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తానని.. హామీ ఇచ్చిన నడ్డా తన పంతం నెగ్గించుకున్నారు. నడ్డాను అరెస్ట్‌ చేస్తారనే ఊహాగానాల నడుమ కమలదళాధిపతి సికింద్రాబాద్‌కు వెళ్లి గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

అరెస్టులు, నిర్భంధాలకు వెరవబోమంటున్న భాజపా రాష్ట్ర నేతలు పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రజల తరఫున అన్యాయాలను ఎదురిస్తామని స్పష్టం చేస్తున్నారు. తెరాస ప్రభుత్వం అక్రమాలను బయటపెడతామంటున్నారు.

భయపడేది లేదంటున్న తెరాస

బండి సంజయ్‌ అరెస్ట్‌.. తదనంతర పరిణామాలపై తెరాస ఆచితూచి స్పందిస్తోంది. భాజపా-కాంగ్రెస్‌ కుంభకోణాల పార్టీలని విమర్శిస్తోంది. కాళేశ్వరం సహా ఇతర పథకాలపై జేపీ నడ్డా చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథను నీతిఆయోగ్‌ ప్రశంసించిందని గుర్తుచేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో భాజపా నేతలు ఎక్కుడున్నారని ప్రశ్నస్తున్న తెరాస.. భాజపా బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేస్తోంది.

కాంగ్రెస్‌ నేతలు ఫైర్​

PCC chief revanth comments: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీకి మింగుడు పడకుండా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలపై రెండోసారైనా... ప్రజావ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందనే ఉత్సాహంపై భాజపా- తెరాస పంచాయితీ నీళ్లు చల్లినట్లవుతోందని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. పోరాటాలకు దిగగుండా తమను నిర్బంధిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భాజపా-తెరాస కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే బండి సంజయ్‌ అరెస్ట్ తర్వాత పరిణామాలని ట్వీట్‌ చేశారు. భాజపాను ప్రధాన ప్రతిపక్షం చూపే ఎత్తుగడని విమర్శించగా.. గట్టిగా బదులిచ్చిన భాజపా ఆ పార్టీకి హుస్సేన్‌సాగరే గతంటూ కౌంటర్‌ వేశారు. ఎవరి బలమేంటో 2023లో తేల్చుకుందామని సవాల్‌ విసురుతున్నారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.