ETV Bharat / state

స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంగా.. టీహబ్‌-2కి సర్వం సిద్ధం - టీహబ్‌2కి సర్వం సిద్ధం

T-Hub second phase: టీహబ్ రెండో దశ ప్రారంభానికి సిద్ధమైంది. 2వేలకుపైగా అంకురాలు... ఏకకాలంలో కార్యకలాపాలు నిర్వహించుకునేలా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ అందుబాటులోకి రానుంది. టీహబ్ మొదటి దశకు ఇప్పటికే ప్రపంచవ్యాప్త గుర్తింపు రాగా... రెండో దశతో ఇన్నోవేషన్ ఎకోసిస్టం మరింతగా బలపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది.

Special story on T-Hub second phase in Telangana
స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంగా.. టీహబ్‌-2కి సర్వం సిద్ధం
author img

By

Published : Jun 24, 2022, 3:35 PM IST

T-Hub second phase: అంకురాలను ప్రోత్సహించే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ టీహబ్‌కు అద్భుత స్పందన లభించింది. టెక్నాలజీ రంగంలో వినూత్న ఆలోచనలతో వచ్చే స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో 2015 నవంబరులో టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో... ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేశారు.

స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంగా.. టీహబ్ అనతి కాలంలోనే అంకురాలకు కేంద్రంగా నిలిచింది. వినూత్న ఆలోచనలున్న ఆవిష్కర్తలను గుర్తించి, విజయవంతమైన స్టార్టప్‌లుగా ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని ఇక్కడ అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడేళ్లలో టీహబ్ ద్వారా 1200 అంకురాలకు సహకారం అందించారు. దాదాపు 600 ప్రఖ్యాత కంపెనీలతో కలిసి పనిచేసింది. ఔత్సహికులకు 1800 కోట్ల రూపాయల నిధులను సమకూర్చారు. టీహబ్ అంకురాలతో 2500మంది వరకు ఉపాధి అవకాశాలు లభించాయి. టీహబ్ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన వీహబ్, డేటా సెంటర్, టీవర్క్స్ వంటి వాటికి కూడా మంచి స్పందన లభించింది. వివిధ రంగాల్లోనూ ఇంక్యుబేటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంది. రాష్ట్రంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టంను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పడటంతో పాటు దేశవ్యాప్తంగా పలువురి మన్ననలు అందుకుంటున్నాయి.

రెండో దశ ప్రారంభానికి సర్వం సిద్ధం... అయితే టీహబ్ మొదటి దశలో విస్తీర్ణం తక్కువగా ఉండడంతో ఒకేసారి వందకు మించి అంకురాలకు అవకాశం లేకుండా పోయింది. చాలా మంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నప్పటికీ స్థలాభావం సమస్యగా మారింది. దీంతో విశాలమైన మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం... టీహబ్ రెండో దశకు శంకుస్థాపన చేసింది. మాదాపూర్‌ రాయదుర్గంలోని నాలెడ్జ్‌సిటీలో మూడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్ రెండో దశ సిద్ధమైంది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించారు. మూడెకరాల విస్తీర్ణంలో 276కోట్ల రూపాయలతో టీహబ్ రెండో దశ భవనం సిద్ధమైంది. ఏకకాలంలో రెండు వేలకుపైగా అంకురాల తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా టీహబ్ రెండో దశలో అన్నిరకాల మౌలిక వసతులు కల్పించారు.

ఈనెల 28న ప్రారంభం... అత్యాధునిక సదుపాయాలు, వినూత్నంగా సిద్ధమైన అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ను ఈనెల 28న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. యూనికార్న్‌ స్టార్టప్‌లు మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్‌ కేర్‌, డెలివరీ వ్యవస్థాపకులతోపాటు సీక్యా క్యాపిటల్‌, యాక్సిల్‌, ఎండియా పార్ట్‌నర్స్‌, కలారి క్యాపిటల్‌ వంటి వెంచర్‌ పెట్టుబడిదారులు, మారుతి సుజూకి, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌, ఎస్‌ఏపీ వంటి కార్పొరేట్‌ దిగ్గజాల ప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కానున్నారు. అంకురాలతోపాటు వెంచర్‌ క్యాపిటలిస్టులకు కూడా టీహబ్ రెండో దశలో చోటు కల్పించనున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ భవనం దేశంలోనే అతిపెద్ద, ప్రపంచంలో రెండో పెద్ద ఇంక్యుబేటర్‌గా నిలువనుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టం మరింతగా బలపడుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. టీహబ్‌ రెండో దశతో రాష్ట్ర ఖ్యాతి జాతీయ స్థాయిలో మరింత ఇనుమడిస్తుందని అంటున్నారు.

స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంగా.. టీహబ్‌-2కి సర్వం సిద్ధం

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.