Special Story on Student Tribe Innovators : చదువు పూర్తి కాగానే చాలా మంది ఏదైనా సంస్థలో ఉద్యోగం సంపాదించి కెరీర్‌లో స్థిర పడిపోతారు. కొందరు మాత్రం అనుభవాల ద్వారా నలుగురికి ఉద్యోగం కల్పించే దిశగా ప్రయాణిస్తారు. ఆ కోవకే చెందుతాడీ యువకుడు. స్నేహితులతో కలిసి అంకురాన్ని ప్రారంభించాడు. యువత నైపుణ్యాలు పెంచుకోవడానికి కృషి చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ యువకుడి పేరు శ్రీచరణ్. బీటెక్ తర్వాత ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో కళాశాలల నుంచి విద్యార్థుల్ని రిక్రూట్ చేసుకుని నైపుణ్యాభివృద్ధి కోసం వారికి శిక్షణ ఇచ్చేవాడు. అప్పుడే కళాశాలలు, సంస్థలకు మధ్య అంతరం గమనించారు. దీన్ని భర్తీ చేస్తే విద్యార్థులకు మంచి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని భావించాడు.
Student tribe App For Graduate Employment Internship : కళాశాలలకు, సంస్థలకు మధ్య వారధి ఏర్పాటు చేస్తే ఇంటర్న్‌షిప్‌లు, స్కిల్‌డెవలప్‌మెంట్, ఉద్యోగ కల్పనల సాధన సులభతరం అవుతుందని ఆలోచించాడు శ్రీచరణ్. తన స్నేహితుడు, తమ్ముడికి ఆ విషయం చెప్పగా ఇద్దరూ బావుందన్నారు. అలా వారి ఆలోచన నుంచి 2015లో స్టూమాక్స్ స్టార్టప్ పెట్టి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే మ్యాగజీన్‌కి శ్రీకారం చుట్టారు.
అడ్డంకులను ఫుట్‌బాల్ ఆడేసి.. రాష్ట్రానికి తొలి కోచ్‌గా రాణిస్తున్న యువతి
విద్యార్థులకు దగ్గరవ్వాలనే ప్రయత్నంలో రూపొందించిన మ్యాగజీన్‌కు మంచి స్పందన వచ్చింది. కానీ, కొవిడ్ వారి ప్రయత్నాలకు అవాంతరంగా మారింది. దాంతో యాప్ రూపొందించి సరికొత్తగా రాణించాలని భావించారు. అలా స్టూమాక్స్ పేరు స్టూడెంట్ ట్రైబ్‌గా మార్చి విద్యార్థుల కోసం వినూత్న యాప్ అందుబాటులోకి తీసుకువచ్చారు. కళాశాల, కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
దూరం ఎంతున్నా.. దూకేస్తానంటున్న 'గురుకులం కుర్రాడు'
స్టూడెంట్ ట్రైబ్ యాప్ ద్వారా ఒకే రకమైన ఆలోచన విధానాలు ఉన్న విద్యార్థులందరిని ఒకే వేదికపైకి తీసుకువస్తున్నారు వీరంతా. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు వృద్ధి చేయడంతో పాటు, ప్రత్యేకంగా గిగ్ వర్స్క్, వర్క్ షాప్స్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచి. యువతకు ఉద్యోగ కల్పన చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నిస్తున్నాం అంటున్నారు.
యువమిత్రుల ప్రస్థానం: ఉద్యోగాలు వదిలి.. ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగి..!
యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నవిద్యార్థికి ఎలాంటి ఉద్యోగాలు కావాలి, ఎలాంటి నైపుణ్యాలు, ప్రతిభ ఉన్నాయో సమీక్షిస్తారు. ఇంకేం కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారనే విషయాలు తెలుసుకుని, వారి అవసరాలకు తగినట్లు నిపుణుల ద్వారా కొన్ని ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం విద్యార్థుల నుంచి ఎలాంటి రుసుమూ తీసుకోవడం లేదు.
పగలు డెలివరీ బాయ్.. రాత్రి సెక్యూరిటీగార్డ్.. భిక్షాటన మానేసి కుటుంబాన్ని పోషిస్తున్న దివ్యాంగుడు
ముగ్గురితో ప్రారంభమైన స్టార్టప్, నేడు 50మంది యువతకి ఉపాధి కల్పిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల మంది విద్యార్థులు ఈ యాప్‌లో రిజిస్టర్ అయ్యారు. సంవత్సరం కాలం నుంచి 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని నిర్వాహకులు చెబుతున్నారు. తమ దగ్గరికి వచ్చిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అంటున్నారు ఈ టీమ్.
చిన్నఆలోచనతో మొదలైన ఈ స్టార్టప్ ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగింది. ఏంజిల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో వ్యాపారంలో రాణిస్తున్నారు. యువతను ఉద్యోగాల్లో నియమించుకుంటున్న కంపెనీల నుంచి కొంత మొత్తం తీసుకుంటూ మంచి ఆదాయం అందుకుంటున్నారు. ఈ రకమైన సేవలు ఇతర రంగాలకు కూడా విస్తరించి, అతి పెద్ద ఉద్యోగ కల్పన యాప్‌గా ఎదగాలని ప్రణాళిక వేసుకున్నట్లు చెబుతున్నారీ ఔత్సాహికులు.
ఆదర్శ పెట్రోల్ బంక్.. ఆదాయంతో అమరవీరుల కుటుంబాలకు సాయం.. పిల్లల చదువు కోసం..