లాక్‌డౌన్‌తో ఇంటి నుంచే పనిచేస్తున్న ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి... తన పరిసరాల్లో ఎవరూ ఆకలితో అలమటించకూడదని నిర్ణయించుకున్నాడు. 2నెలలుగా తన జీతంతోపాటు భవిష్యనిధి డబ్బులను మొత్తం ఖర్చుపెట్టి నిరుపేదలకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.
ఎల్బీనగర్ రాక్ టౌన్ హిల్స్ కాలనీలో నివాసముంటున్న రాము.. బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వచ్చిన నిరుపేదల బాధలు తెలుసుకొని వాళ్ల ఆకలి దప్పికలు తీరుస్తున్నాడు. తన ఇంటి వద్దనే రైస్ ఏటీఎం పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని తెరిచి సరుకులు అందిస్తున్నాడు. లాక్‌డౌన్ కష్టాలు పూర్తిగా తీరగానే... రైతులకు- యువతకు మధ్య వారధిగా నిలిచేలా ప్రత్యేక ప్రాజెక్టు చేపడతాముంటున్నాడు రాము.
ఇదీ చూడండి: 7.5 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్