ETV Bharat / state

మంచి ఆలోచనతో రండి.. సరికొత్త ఆవిష్కరణతో వెళ్లండి

Special Story on Hyderabad T Works : ఐటీ రంగంలో చైనా, తైవాన్‌, దక్షిణ కొరియా.. మనకు సాటి రానే రావు. కానీ ఎలక్ట్రానిక్స్‌, టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీలో అవి మనకన్నా ఎంతో ముందున్నాయి. మన వద్ద తయారీ రంగం అభివృద్ధి చెందాలంటే తగిన ప్రోత్సాహం ఉండాలి. దాంతో హైదరాబాద్‌లోని ‘టీ వర్క్స్‌’ సరిగ్గా ఆ పనే చేస్తోంది. దేశంలోనే అతి పెద్ద ప్రొటోటైప్‌ తయారీ వేదికగా మారింది.

T Works
T Works
author img

By

Published : Apr 9, 2023, 12:17 PM IST

Special Story on Hyderabad T Works : సాధారణంగా మనిషికి వచ్చిన ఆలోచనను ఆవిష్కరణగా మార్చే క్రమంలో ఎన్నో దశలు ఉంటాయి. ముందుగా దానికి సంబంధించిన డిజైన్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత నమూనా ఉత్పత్తి తేవాలి. మనం ఆవిష్కరించేది విద్యుత్తుతో పని చేసే పరికరమైతే ఎలక్ట్రికల్ అంశాలు ఎన్నో ముడిపడి ఉంటాయి. అందుకే మంచి ఆలోచన మన బుర్రకు తట్టినా ఇటువైపు ఎవరూ త్వరగా ముందడుగు వేయలేరు. ఆ పరిస్థితుల్లో మార్పు తెచ్చే లక్ష్యంతో వచ్చిందే టీ-వర్క్స్‌. హైదరాబాద్‌ను అంకుర సంస్థల కేంద్రంగా మార్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే టీ-హబ్‌, వీ-హబ్‌లను ప్రారంభించింది. వీటితో ప్రధానంగా ఇంటర్నెట్‌ ఆధారిత సేవల సంస్థలకు ప్రయోజనం. ఉత్పత్తి విభాగంలోనూ ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ‘టీ వర్క్స్‌’ను ఇటీవల ప్రారంభించింది.

అందరికీ అందుబాటులో : కంపెనీలు ఒక ఉత్పత్తిని మార్కెట్‌లోకి తెచ్చే ముందు ప్రొటోటైప్‌(నమూనా)ను తయారు చేస్తాయి. వీటి తయారీకి టీ వర్క్స్‌ సాయపడుతుంది. అంకురాలే కాదు, విద్యార్థులూ, వ్యక్తులూ, కార్పొరేట్‌ సంస్థలూ ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. రాయదుర్గంలో టీ హబ్‌కు ఆనుకొని 4.79 ఎకరాల్లో విస్తరించి ఉంటుందీ టీ-వర్క్స్‌. ఇటీవల తైవాన్‌కు చెందిన ప్రముఖ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూ దీన్ని ప్రారంభించారు.

దీంట్లో మెటల్‌, వుడ్‌, త్రీడీ ప్రింటింగ్‌, లేజర్‌ కటింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, సిరామిక్స్‌, టెస్టింగ్‌... ఇలా భిన్న రకాల వర్క్‌షాప్‌లు ఉండగా.. మరెన్నో రానున్నాయి. బయట పరిశ్రమలు ప్రొటోటైప్‌ల తయారీకి ఆసక్తి చూపవు. ఒకవేళ అంగీకరించినా ఎక్కువ మొత్తం అడుగుతాయి. సిరామిక్‌, ఎలక్ట్రానిక్స్‌... ఇలా భిన్నమైన విభాగాలు టీ-వర్క్స్‌లో ఉండటంవల్ల ప్రొటోటైప్‌లో వీటన్నింటినీ ఉపయోగిస్తే వాటి విడిభాగాల తయారీ సులభమవుతుంది. ‘టీ వర్క్స్‌’లో నామమాత్రపు రుసుముతోనే ప్రొటోటైప్‌ని తయారుచేసుకోవచ్చు. చిన్న చిన్న మార్పులతో అప్పటికప్పుడు నాలుగైదు మోడల్స్‌నీ తయారుచేసుకోవచ్చు.

ఖర్చుతోపాటు సమయమూ ఆదా : ఆ విధంగా చేయడం ద్వారా ఖర్చుతోపాటు సమయమూ ఆదా. ‘టీ వర్క్స్‌’ కోసం ఇప్పటివరకూ సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. రూ.11.5 కోట్ల విలువైన 200 యంత్రాలు ప్రస్తుతానికి తెచ్చారు. మన మార్కెట్‌లో అందుబాటులో లేని ట్యూబ్‌ బ్లెండింగ్‌ మెషీన్‌ని స్పెయిన్‌ నుంచి తెప్పించారు. దీంతో గొట్టాల్ని కావాల్సిన విధంగా ఒంపులు తిప్పొచ్చు. సాఫ్ట్‌వేర్‌లో డిజైన్‌ చేసిన విధంగా కలపని కటింగ్‌ చేసే యంత్రాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక రోబోటిక్‌ ఆర్మ్‌ తయారీ సంస్థకి కొన్ని విడి భాగాల ప్రొటోటైప్‌లను తయారుచేశారు. ఎల్వీ ప్రసాద్‌ హాస్పిటల్‌ కోసం సర్జికల్‌ గైడ్‌ రెజీన్‌నూ, ‘స్కై రూట్‌’ అంకుర సంస్థ తయారుచేసిన రాకెట్‌ ఇంజిన్‌లో ఒక భాగాన్నీ, సీసీఎంబీ కోసమూ ఓ పరికరాన్నీ త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా చేసిచ్చారు.

వెయ్యి వరకూ పరికరాల అభివృద్ధి : కరీంనగర్‌ ఫిలిగ్రీ కళాకారులకు బొమ్మల తయారీలో ఉపయోగించే చిన్న విడి భాగాలను యంత్రాలతో చేసే విధానం గురించి ఇక్కడ డిజైన్‌, మెటల్‌ విభాగం నిపుణులు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకూ 300 సంస్థలు, వ్యక్తుల కోసం వెయ్యి వరకూ పరికరాల్ని అభివృద్ధి చేశారు. అక్రిలిక్‌, వుడ్‌, సిరామిక్‌, ఎలక్ట్రానిక్స్‌... అన్నింటిలో నిపుణులూ, కళాకారులు ఉంటారు. టెస్టింగ్‌ ల్యాబ్‌లో వేర్వేరు ఉష్ణోగ్రతల్లో, భౌగోళిక పరిస్థితుల్లో ఆ వస్తువు పనితీరుని పరీక్షించుకోవచ్చు.

నైపుణ్య శిక్షణ కేంద్రం : సామాన్యుల్లోని ఆవిష్కర్తల్ని ప్రోత్సహించేందుకు ‘ఇన్నోవేషన్‌ హబ్‌’గానూ ఇది పనిచేస్తోంది. వరంగల్‌కు చెందిన టీవీ మెకానిక్‌ రాజేందర్‌ ఇక్కడ గో కార్టింగ్‌ ఈవీ వాహనాల్ని అభివృద్ధి చేశాడు. అశోక్‌ అనే యువకుడు విత్తనాలు నాటే యంత్రం రూపొందించాడు. ఇలాంటివారిని ‘జూనియర్‌ ఫెలోషిప్‌’ విభాగంలో ఎంపికచేసి, నైపుణ్యాల్ని మెరుగుపర్చి వ్యాపారులుగా మారేందుకు మార్గనిర్దేశం చేస్తోంది టీ వర్క్స్‌. విద్యార్థులూ, యువకులకు హ్యాకథాన్ల మాదిరిగా నిర్దిష్ట సమయంలో ఉత్పత్తిని తెచ్చే ‘మెకథాన్‌’లనూ పెట్టనున్నారు. వివిధ రంగాలవాళ్ల నైపుణ్యాల మెరుగుకు ప్రత్యేక సదస్సులూ, శిక్షణ శిబిరాలూ పెడతారు. ఇక్కడ సేవల కోసం వచ్చే వారికి నామమాత్రమైన మొత్తం తీసుకుంటారు. తయారీ, ఉత్పత్తి రంగాల్లో భారత్‌ని అగ్రగామిగా నిలిపే ఏకైక లక్ష్యంతో పనిచేస్తోంది టీ-వర్క్స్‌. పదేళ్లలో దీనిద్వారా ప్రయోజనం పొందిన ఎన్నో సంస్థల ఉత్పత్తులు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.