ETV Bharat / state

'గెలిస్తే మనసులోనే అభినందించడం.. ఓడిపోతే భుజం తట్టడమే ఆయనకు తెలుసు' - fathers day special story

FATHER'S DAY: ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ... నీకు ప్రపంచాన్ని పరిచయం చేసేవాడు నాన్న’ అనేది నానుడి. నిజమే మరి.. జీవితాన్నిచ్చేది అమ్మ అయితే జీవన విధానాన్ని నేర్పేది నాన్న. బిడ్డకు నడక, నడవడిక, నాగరికత, సమాజంలో మనగలిగే ఒడుపు, లౌకిక వ్యవహారాలు, మనుగడకు మెలకువలు లాంటివెన్నో నేర్పించే ఆది గురువు తండ్రి. తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకు నడిపించడమంటే దారి చూపడం కాదు, భవిష్యత్తులోకి దారితీయడం.

'బిడ్డ గెలిచినప్పుడు మనసులోనే అభినందించడం.. ఓడిపోతే భుజం తట్టడమే ఆయనకు తెలుసు'

author img

By

Published : Jun 19, 2022, 12:34 PM IST

FATHER'S DAY: నాన్న అమ్మకుమల్లే బోళామనిషి కాడు. కలిగే కష్టాలు, తగిలే గాయాలు బహిర్గతం చేయని ధీరగంభీరుడు. కాఠిన్యాలూ, కన్నెర్రజేయడాలూ ప్రేమలేక కాదు, దాన్ని వ్యక్తం చేయలేకా కాదు. ఎదుగుదల ఆగక, విజయపథంలో దూసుకుపోవాలన్న ఆరాటమే ఆయన్ని మౌనంగా ఉంచేస్తుంది. బిడ్డ గెలిచినప్పుడు మనసులోనే అభినందిస్తాడు. ఆ బిడ్డే ఓడిపోతే భుజం తట్టి ధైర్యం చెబుతాడు. అదీ తండ్రి శైలి. అదే ఆయన ఔన్నత్యం.

తండ్రి తానే స్వయంగా పుత్ర రూపంలో జన్మిస్తాడన్నది వేదసూక్తం. అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల ‘అంగాదంగాత్‌ సంభవతి పుత్రః హృదయాదభిజాయతి ఆత్మావై పుత్ర నామాసి- అనే వేద వచనం వినలేదా? శరీర కణాల నుంచే కాదు, హృదయ అనుభూతితో జన్మించేవాడు పుత్రుడు. తండ్రి లక్షణాలు కొడుకులో ప్రతిఫలిస్తాయి కనుక ఇతడు నీ పుత్రుడో కాదో నువ్వే పరీక్షించుకో’ అంటుంది దుష్యంతునితో.

జఠరాగ్ని వల్ల కడుపులోని ఆహారం జీర్ణమై రక్త, వీర్యాలుగా మార్పు చెంది సంతానోత్పత్తికి కారణమవుతుంది. అగ్ని సృష్టికారక శక్తి- అంటూ రుగ్వేదం అగ్నిని పితృసమంగా అభివర్ణించింది. అలాగే అగ్ని లక్షణాలన్నీ తండ్రికి ఉంటాయంటూ అగ్ని గుణధర్మాల గురించి చెబుతున్న సందర్భంలో తండ్రిని అగ్నితో పోల్చడం చూస్తాం.

యస్మాత్పార్దివ దేహః ప్రాదుర భూద్యేన భగవతా గురుణా

ఎవరివల్ల ఈ భౌతిక శరీరం జన్మించిందో అలాంటి భగవత్‌ స్వరూపుడు, సర్వజ్ఞమూర్తి అయిన తండ్రికి వేలాది నమస్కారాలు’ అన్నది దీని భావం.

‘తండ్రిని సేవించడమే పరమ ధర్మం. తండ్రిని అన్ని విధాలా సుఖపెట్టడం, ధర్మవర్తనుడైన తండ్రి ఆదేశాలను అనుసరించడం సర్వ శ్రేష్టమైన తపస్సు. తండ్రిని ప్రసన్నం చేసుకుంటే సకల దేవతలూ ప్రసన్నులౌతారు’ అంటోంది మహాభారతం.

‘నేను నిముసంబు గానక యున్న నూరెల నరయు మజ్జనకుండు..’ అంటూ తండ్రి మనసు ఎలాంటిదో, అలాంటి తండ్రి పట్ల కుమారుడు ఎలా ప్రవర్తించాలో మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు పలికిన ఈ మాటలతో తెలుస్తుంది.

తప్పటడుగుల వయసులో చేయూతనందించి, తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్ది, త్యాగాలకు గాంభీర్యపు పూత పూసేది నాన్నే.

దారుణే చ పితా పుత్రే నైవ దారుణతాం వ్రజేత్‌

పుత్రార్థే పదఃకష్టాః పితరః ప్రాప్నువన్తి హి

పుత్రుడిది ఒకవేళ క్రూర స్వభావమైనా కూడా తండ్రి అతనితో ప్రేమగానే నడచు కుంటాడు. కుమారుడి కోసం ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా ఎదుర్కొంటాడు- అంటూ అభివర్ణించారు హరివంశ పురాణం విష్ణు పర్వంలో.

నతో ధర్మాచరణం కించిదస్తి మహత్తరమ్‌

యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రిపా

‘తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడాన్ని మించిన ధర్మాచరణ లేదు’ అని వాల్మీకి రామాయణం చెబుతోంది. ఆ ప్రకారమే శ్రీరాముడు తండ్రికి శుశ్రూష చేస్తూ ఆయన ఆదేశాలు పాటించడమే ధర్మంగా భావించాడు. తండ్రి మాట జవదాటక పురుషోత్తముడయ్యాడు. తండ్రి ఆజ్ఞానుసారం తల్లిని పోగొట్టుకున్నా ఆయన్ను మెప్పించి తల్లిని బతికించుకున్నాడు భార్గవ రాముడు.

‘సర్వదేవ మయః పితా’ అన్నారు. అంటే తండ్రి సర్వదేవతా స్వరూపుడని భావం. ఆ విషయాన్ని రూఢి పరిచింది పద్మపురాణం.

పితా ధర్మః పితా స్వర్గః పితా హి పరమం తపః

పితరి ప్రీతిమాపన్నే ప్రీయన్తో సర్వదేవతాః

తండ్రే ధర్మం, తండ్రే స్వర్గం, తండ్రే తపస్సు. తనకు అనుకూలంగా నడుచుకుంటున్న కొడుకు పట్ల తండ్రి సంతుష్టుడైతే సకల దేవతలూ సంతృప్తులు అవుతారట. ధర్మమూర్తి అయిన తండ్రికి సేవ చేస్తే ఇహలోకంలో కీర్తి, ఆనక మోక్షం సిద్ధిస్తాయని ఈ పురాణమే మరో చోట చెప్పింది.

బిడ్డకు ఏది, ఎంత, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో, వేటిని ఇవ్వకూడదో క్షుణ్ణంగా తెలిసిన వాడు తండ్రి. అతడి హృదయం లోతైనది. మాట కటువు, మనసు సున్నితం.

సహసా విదధీత న క్రియా మవివేకః పరమాపదాం పదం

వృణుతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధా స్స్వయమేవ సంపదః

తండ్రికి తనపట్ల ఇష్టంలేదనుకోవడం అవివేకం, ఆయనది అవ్యాజప్రేమంటూ భారవి కవి కిరాతార్జునీయంలో రాసిన శ్లోకమది. తొందరపాటు, అవివేకం ఆపదలకు మూలం. ఆలోచించి కార్యనిర్వహణకు పూనుకునే వివేకవంతుణ్ణి, సద్గుణాలయందు ప్రీతిగల సంపదలు తామే వచ్చి వరిస్తా’యన్నది దీని భావం.

ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న ప్రేమిస్తాడు, వ్యక్తం చేయడు. ఆదరిస్తాడు, ఆర్భాటం చేయడు. అందుకే అనాదిగా ఆయన పూజ్యనీయ స్థానంలోనే ఉన్నాడు. నిరంతరం బిడ్డల ఉన్నతిని కాంక్షించే తండ్రిపట్ల భయభక్తులే కాదు మమతానురాగాల్నీ పంచాలి. అదే ఆయనకిచ్చే సిసలైన గౌరవం.- శారదాదిత్య

ఇవీ చూడండి..

Fathers Day 2022: మీరు.. ఎలాంటి నాన్న?

ఫాదర్స్​ డే.. డూడుల్​తో గూగుల్​ స్పెషల్​ విషెస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.