Special story On Dundigal Air Force Academy : ఎయిర్‌ఫోర్స్ విన్యాసాల వీడియో చూస్తున్నారుగా.! ఎయిర్‌ఫోర్స్‌లో(Air Force) శిక్షణ తీసుకున్న క్యాడెట్లు ఎలాంటి విన్యాసాలు చేస్తున్నారో.! ఇలా గాల్లో విన్యాసాలు మాటలు కాదు. సరైన సాధన, నైపుణ్యం, ధైర్యం ఉండాలి. అవ్వన్ని తమలో నిండుగా ఉన్నాయని నిరూపించుకుని క్యాడెట్ల నుంచి ఆఫీసర్లుగా మారారు వీరంతా. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో శిక్షణ పొంది ప్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో రాణించేందుకు సిద్ధమయ్యారు. దేశానికి మెరికల్లాంటి అధికారులను అందిస్తున్న దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ(Dundigal Air Force Academy) నుంచి బ్యాచ్ బయటకు వచ్చింది.
Special Story On Dundigal AIR Force Academy : 'దేశ సేవ చేయడమే మా అంతిమ లక్ష్యం'
213 Cadets Completed The Training : ఈ దఫా మొత్తం 213 మంది క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు అకాడమీలో. ఈసారి 25 మంది మహిళా క్యాడెట్లూ ఉన్నారు. వీరితో పాటు పలు విభాగాల్లో మరో 8 నేవీ, 9 మంది ఇండియన్ కోస్టుగార్డు, ఇద్దరు విదేశీయులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. మూడు చేతక్ హెలికాప్టర్లు, 3 పిలాటస్ పీసీ-7, ఎమ్కే-2 హెలికాప్టర్లు, కిరణ్, హవాక్ హెలికాప్టర్లపై శిక్షణ తీసుకున్నారు క్యాడెట్లు. ఆ నైపుణ్యంతో పరేడ్ సమయంలో విన్యాసాలు చేశారు. ఈ ఏడాది పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క్యాడెట్లు ప్రతిభాపాటవాల్ని ప్రశంసించారు.
Cadets On Passing Out Parade : పరేడ్ రివ్యూయింగ్ అధికారిగా ఎయిర్ ఛీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి వ్యవహరించారు. ఈ కొత్త సాహసవీరుల్లో దేశ సరిహద్దుల్లో గగనతలాన్ని రక్షించేందుకు ఉవ్విళ్ళూరుతున్న క్యాడెట్లు కొందరైతే, తండ్రి ప్రోత్సాహంతో, తల్లి ఆకాంక్షతో ఎయిర్ ఫోర్స్‌పై అమితమైన ఆసక్తితో వచ్చినవాళ్లు మరికొందరు. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. కానీ అందరి అలోచన ఒక్కటే. తమకొచ్చిన ఈ అవకాశం దేశ సేవకు వినియోగించాలని, పాసింగ్ అవుట్ పరేడ్‌లో క్యాడెట్ల నుంచి ఆఫీసర్‌గా మారే పిప్పెట్ సెర్మనీ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు వీరంతా.
Surya Kiran Flying Officer in Ranga Reddy : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన ఈ యువకుడి పేరు సూర్యకిరణ్. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ వార్ సమయంలో జన్మించాడు. భారత జవాన్ల వీరోచిత పోరాటం చూసి ఇతడి తల్లిందండ్రులు చలించిపోయారు. తమ కుమారుడిని దేశ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. వారి కోరిక దేశ సేవ చేయాలనే ఆకాంక్షతో ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా ముందుకు సాగాడు. ఫలితంగా ఫ్లైయింగ్ ఆఫీసర్ అయ్యాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తునారు.
"చిన్నప్పటి నుంచి ప్లైయింగ్ ఆఫీసర్ అవ్వడం నా కోరిక. యువతకు ఎయిర్ ఫోర్స్ రంగం వైపు రావాలి. పిల్లల్ని దేశ సేవ వైపు తల్లి దండ్రులు పోత్సహించాలి. వ్యవసాయానికి రైతు ఎంత అవసరమో దేశానికి సైనికుల అవసరం అంతే ఉంది."-సూర్య కిరణ్, ఫ్లైయింగ్ ఆఫీసర్
"కార్గిల్ యుద్ద సమయంలో సూర్యకిరణ్ పుట్టాడు దాంతో ఈ రంగంలో మా కుమారుడిని చేర్పించాము. చిన్నప్పటి నుంచి డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ వైపు పంపాడమే మా ధ్యేయం, శిక్షణ పొంది, ఉద్యోగం సాధించడం వల్ల మా కల నేరవేరింది."-శేఖర్, సూర్యకిరణ్ తండ్రి
తల్లి పోత్సాహంతో వైమానిక దళంలోకి : వైమానికి దళంలో ఉండటమే కాదు దేశ రక్షణలో ముందుండి సైన్యాన్ని నడపాలి. ఇవి నల్గొండకు జిల్లాకు చెందిన అమిత్ రెడ్డికి తల్లి చెప్పిన మాటలు. అవే బలంగా నమ్మి అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నాడు. ఫ్లైయింగ్ అధికారి అయ్యాడు. ఇప్పుడు తన తల్లి కళ్లల్లో ఆనందాన్ని చూడటం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు అమిత్ రెడ్డి.
శిక్షణ కోసం సొంత ఇళ్లును అమ్మి ప్లైయింగ్ అధికారిగా మారిన జోసఫ్ : చిన్ననాటి నుంచి సైన్యంలో చేరాలని ఆశ, ఇందుకోసం అహర్నిశలు శ్రమించిన జోసెఫ్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ తల్లిదండ్రులు ముందుండి ప్రోత్సహించారు. ఎన్డీఏలో శిక్షణ కోసం గుంటూరు జిల్లాలోని సొంత ఇంటిని సైతం అమ్మేసుకున్నారు. ప్రతిఫలంగా నేడు ప్లైయింగ్ అధికారిగా మారాడు జోసఫ్. పరేడ్ పూర్తి చేసుకున్న అనంతరం మొదటి సెల్యూట్ తల్లిదండ్రులకు చేసి ఆలింగనం చేసుకున్నాడు. ప్రస్తుతం దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటి అధికారులు తదుపరి శిక్షణకు వారి వారి విభాగాల్ని బట్టి శిక్షణ పొందనున్నారు.
Dundigal Air Force Academy : అనుక్షణం అప్రమత్తంగా ఉండటమే కాక దేశ భూభాగాన్ని గగన తలం నుంచి రక్షిస్తునే మిగిలిన దళాలను అప్రమత్తం చేస్తుంది వాయుసేన. అలాంటి రంగంలో రాణించడం గర్వంగా ఉందంటున్నారు వీరంతా. ప్రస్తుతం దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటి అధికారులు తదుపరి శిక్షణకు వారి వారి విభాగాల్ని బట్టి శిక్షణ పొందనున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండటమే కాక దేశ భూభాగాన్ని గగన తలం నుంచి రక్షిస్తునే మిగిలిన దళాలను అప్రమత్తం చేస్తుంది వాయుసేన. అలాంటి రంగంలో రాణించడం గర్వంగా ఉందంటున్నారు వీరంతా.
"చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులే ప్రేరణ, నా డ్రిమ్ ఫ్లైయిలెట్ అవ్వడం దానికి తోడు మా అమ్మ సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఈ ఉద్యోగం సాధించగలిగాను. మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు తోడుగా నిలిచాడు. జీవితంలో ఏ రంగంలోనైనా కష్ట పడాల్సిందే దాన్నే ప్రేరణగా తీసుకోని ఇక్కడి వరకు చేరుకొగలిగాను. 110 ఫైయిలెట్లో నేను మూడవ స్థానంలో ఉన్నాను. నా ఉద్యోగంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి."-జోసెఫ్, ఎండీబీ ఫ్లైయింగ్ అధికారి
సరిహద్దుల్లో ఉద్రిక్తత- భారీ చొరబాట్లకు ఉగ్రమూకల యత్నం, తిప్పికొట్టిన ఆర్మీ
IAF Made In India Projects : వాయుసేన 'మేక్ ఇన్ ఇండియా' మంత్రం.. రూ.3.15లక్షల కోట్లతో భారీ ప్లాన్!