ETV Bharat / state

రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం.! ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు.. - వారాహి వాహనానికి పూజలు

SPECIAL PUJA TO VARAHI : ఏపీ రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని జనసేన అధినేత పవన్​ కల్యాణ్ అన్నారు. తన రాజకీయ యాత్రల కోసం సిద్ధం చేసిన వారాహి వాహనానికి దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు.

janasana chief pawan kalyan
జనసేన అధినేత పవన్​
author img

By

Published : Jan 25, 2023, 12:02 PM IST

Updated : Jan 25, 2023, 1:18 PM IST

PAWAN IN VIJAYAWADA : ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన అంతం కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇవాళ్టి నుంచి రాక్షస పాలనను అంతం చేయడమే లక్ష్యంగా వారాహి ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. దుర్గమ్మ ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రికి వచ్చినట్లు పవన్ తెలిపారు. తొలుత తెలంగాణలోని కొండగట్టులో వారాహికి పూజలు నిర్వహించినట్లు చెప్పారు.

ఏపీలోని విజయవాడ దివ్య క్షేత్రం కాబట్టి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని పవన్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ముందుకు సాగాలని అభిలాషించారు. ఆలయానికి వచ్చిన పవన్​కు జనసేన నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పవన్ కల్యాణ్​ పాల్గొన్నారు.

తన రాజకీయ యాత్రలకు ఉపయోగించనున్న వారాహి వాహనానికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. తెలంగాణలో నిన్న కొండగట్టు, ధర్మపురి ఆలయాలను దర్శించుకుని పూజలు చేసిన పవన్.. నేరుగా విజయవాడ చేరుకున్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోని నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక అమలుపై చర్చించనున్నారు.

janasana chief pavan kalyan
జనసేన అధినేత పవన్​కల్యాణ్​

ఇవీ చదవండి:

Last Updated : Jan 25, 2023, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.