ETV Bharat / state

Corona: కొవిడ్​ తగ్గినా అనారోగ్య సమస్యలా.. అయితే ఈ ఆస్పత్రి మీకోసమే! - కొవిడ్‌ తర్వాత కొన్ని సమస్యలు సాధారణమే

కరోనా నుంచి పూర్తిగా కోలుకొని సాధారణ జీవితాన్ని గడుపుతున్నా.. అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మానసిక ఆందోళన, నిద్రలేమి, శ్వాస, మధుమేహం, నరాల బలహీనత, అలసట, హృద్రోగ సమస్యలతో సతమతమవుతున్న వారూ ఉన్నారు. ఇలాంటి వారి కోసం వైద్య విధాన పరిషత్‌ (కింగ్‌కోఠి) జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ‘పోస్ట్‌-కొవిడ్‌ క్లీనిక్‌’ ఏర్పాటు చేశారు.

special-post-covid-clinic-started-in-kingkoti-hospital
కరోనా తగ్గినా అనారోగ్య సమస్యలా.. అయితే ఈ ఆస్పత్రి మీకోసమే..!
author img

By

Published : Jul 6, 2021, 9:11 AM IST

కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని ఇంటికెళ్లాక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికోసం కింగ్​కోఠి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ‘పోస్ట్‌-కొవిడ్‌ క్లీనిక్‌’ ఏర్పాటు చేశారు. జనరల్‌ ఫిజీషియన్‌, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, మానసిక వైద్య నిపుణులు వివిధ సమస్యలతో వచ్చేవారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి, అవసరమైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ క్లీనిక్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రసుత్తం క్లీనిక్‌లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు..? ప్రజలు ఏ తరహా సమస్యలతో వస్తున్నారు..? వారికిచ్చే సలహాలు, సూచనలేమిటి..? ఆసుపత్రి వైద్యాధికారులు, వైద్య నిపుణుల మాటల్లోనే...

భయమే శత్రువు

డాక్టర్‌ ఎస్‌.నివేదిత, మానసిక వైద్య నిపుణురాలు

ఒకసారి కొవిడ్‌ వచ్చి పోయిన తరువాత బాధితుల్లో యాంటీబాడీస్‌ వస్తాయి. కానీ.. తమ దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ ఎప్పుడు వేసుకోవచ్చని అడుగుతున్నారు. 40-50 ఏళ్ల మధ్యవారు ఎప్పటికప్పుడు మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి. పోస్టు కొవిడ్‌లో హృద్రోగాలు రావడం గమనిస్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తే మంచిది. చాలా మంది వైద్యుల అనుమతి లేకుండానే స్టెరాయిడ్స్‌ వాడేస్తున్నారు. అది బ్లాక్‌ ఫంగస్‌ వంటి సమస్యలకు కారణమవుతోంది. మందులు వాడే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

మధ్య వయస్కులు కాస్త జాగ్రత్త

డాక్టర్‌ నాజియా నౌషీన్‌ సిద్ధిఖా, శ్వాసకోశ వైద్య నిపుణురాలు

ఒక్కసారి ఐసీయూ వరకు వెళ్లిన వ్యక్తి కొవిడ్‌ను జయించాడంటే అతనికది పునర్‌జన్మే. ఇలాంటి చాలా మందిలో ఆ మహమ్మారీ మళ్లీ సోకుతుందేమోనన్న భయం ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి భయాలు మంచిది కాదు. సాధారణంగా ఏదైనా వైరస్‌ సోకినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు దాని ప్రభావం మెదడుపై కూడా ఉంటుంది. అది నిద్రలేమికి కారణమవుతుంది. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా కొవిడ్‌ చికిత్సలో స్టెరయిడ్స్‌ వినియోగిస్తుంటారు. దీనివల్ల కొంత రోగ నిరోధక శక్తి తగ్గవచ్ఛు అలాగని అది దీర్ఘకాలిక సమస్య కాదు. పౌష్టికాహారం తీసుకుంటే చాలు. కానీ.. భయం అనేది మనిషిని తెలియకుండానే కుంగదీస్తుంది. ఈ భయాలకు సామాజికపరమైన అంశాలు ప్రధాన కారణం. కొవిడ్‌ సోకిందని తెలిస్తే అంటరానివారుగా చూడటం, ఆప్యాయంగా పలకరించేవారు లేకపోవడం ఓ కారణమే. అయినవాళ్లు అందుబాటులో ఉంటూ, నేనున్నాననే భరోసా ఇస్తుంటే బాధితుల రికవరీ శాతం కూడా పెరుగుతుంది.

కొవిడ్‌ తర్వాత కొన్ని సమస్యలు సాధారణమే

డాక్టర్‌ మల్లికార్జున్‌, కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి నోడల్‌ అధికారి

కొవిడ్‌ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కొందరికి ఆక్సిజన్‌ స్థాయి 93, 92కు పడిపోవడంతో వణికిపోతుంటారు. అలాగే ఊపిరితిత్తులు గట్టిపడటం (లంగ్స్‌ ఫైబ్రోసిస్‌) వంటి సమస్యలు వస్తాయి. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ వాడతారు కాబట్టి మధుమేహం కూడా కొన్నిసార్లు అదుపులోకి రాకపోవచ్ఛు హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ‘పోస్ట్‌-కొవిడ్‌’ తర్వాత వచ్చే సాధారణ సమస్యలేనని గుర్తించాలి. ఆరు నెలల క్రితం కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలోనూ చాలా మందిలో నేటికీ అలసట, బలహీనత, ఒళ్లు మొద్దుబారినట్లుగా ఉండటం గమనిస్తున్నాం. కొందరేమో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అనారోగ్య సమస్యలతో వచ్చే వారికి పరీక్షలు చేసి, అవసరమైనవారికి ఇక్కడే చికిత్స అందిస్తున్నాం. సమస్య తీవ్రమైందని తెలిస్తే గాంధీ ఆసుపత్రికి పంపిస్తున్నాం.

అవసరమైన పరీక్షలు చేస్తున్నాం..

డాక్టర్‌ కాంతి స్వరూప్‌, జనరల్‌ ఫిజీషియన్‌

పోస్ట్‌ కొవిడ్‌ క్లీనిక్‌కు మధుమేహం అదుపుకావడం లేదని, ఆయాసం వస్తోందని చాలామంది వస్తున్నారు. వీరికి అవసరమైన పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నాం. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు అప్పుడప్పుడు వైద్యులను సంప్రదించాలి.

నిపుణుల సేవలు సద్వినియోగం చేసుకోండి

డాక్టర్‌ రాజేంద్రనాథ్‌, కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ఆసుపత్రిలో పోస్ట్‌ కొవిడ్‌ క్లీనిక్‌ను ప్రారంభించాం. వైరస్‌ బారినపడి కోలుకున్న 2, 3 నెలల తర్వాత చాలా మందిలో శ్వాస సంబంధ, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అలాంటివారు రోజుకు కనీసం 10 మంది వరకు వస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు (పని దినాల్లో) క్లీనిక్‌ పని చేస్తుంది. నిపుణుల సేవలను సద్వినియోగం చేసుకోండి.

ఇదీ చూడండి: TV Classes: టీవీల్లో పాఠాలొస్తున్నా.. వీధుల్లో తిరుగుతున్న విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.