ETV Bharat / state

కష్టే ఫలి: ముదిమి వయసులోనూ 30 పంటలు పండిస్తున్న రైతు

ఆయన వయసు 76. అయితేనేం ఇప్పటికీ పొలం పనుల్లో చురుగ్గా ఉంటారు. తనకున్న కొద్దిపాటి పొలంలో 30 రకాలు సాగు చేస్తూ వ్యవసాయంలోనూ కొత్త పంథాను అనుసరిస్తున్నారు. పొద్దున సాగు, సాయంత్రం పంట అమ్ముకోవడం ఇదీ ఆయన దినచర్య. కష్టే ఫలి అనే సూత్రానికి కట్టుబడి ఈ వయసులోనూ పొలం పనులు చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు... ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన రైతు రోశయ్య.

కష్టే ఫలి: ముదిమి వయసులోనూ 30 పంటలు పండిస్తున్న రైతు
కష్టే ఫలి: ముదిమి వయసులోనూ 30 పంటలు పండిస్తున్న రైతు
author img

By

Published : Oct 29, 2020, 10:49 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా అత్తోటకు చెందిన 76 ఏళ్ల రోశయ్యకు వ్యవసాయమే జీవనాధారం. గతంలో వరి పండించే ఆయన.. వ్యవసాయ శిక్షణ తరగతుల తర్వాత సమీకృత సాగు వైపు మళ్లారు. తనకున్న 75 సెంట్ల పొలంలో వివిధ రకాలు పండిస్తున్నారు. మన ప్రాంతంలో పండని వాటిని సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

ముందుగా తన పొలం చుట్టూ కొబ్బరి మొక్కలు నాటారు. మధ్యలో నిమ్మ, నారింజ, వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరల సాగు చేస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా పశువుల వ్యర్థాలనే పంటకు ఉపయోగిస్తారు. ఉసిరి, నేరేడు, దానిమ్మ, మామిడి, సపోట, సీతాఫలం, పైనాపిల్, రామఫలం వంటి పండ్ల చెట్లు ఇక్కడ కనిపిస్తాయి.

ఉదయం పొలంలో పని.. సాయంత్రం పండ్లు, కాయలు అమ్మడం అతని దినచర్య. భిన్నమైన పంటలు సాగుచేయడం ద్వారా ఒకదానిలో నష్టం వచ్చినా.. మరో పంటలో దాన్ని పూడ్చుకోవచ్చని అంటున్నారు రోశయ్య. పనిచేస్తే ఆరోగ్యంగా ఉంటాం అనే మాటను అక్షరాలా నిజం చేసి చూపిస్తూ.. ముదిమి వయసులోనూ భిన్న పంటలు సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్న రోశయ్య అందరికీ ఆదర్శప్రాయుడు.

ఇవీ చదవండి: బీసీలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి కేసీఆర్: బండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.