ETV Bharat / state

మహిళల భద్రత కోసం మేరీ సహేలీ పేరిట రైల్వే ప్రత్యేక చర్యలు - South central railway updates

మేరీ సహేలీ పేరిట... ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 8 ప్రధాన రైళ్లను గుర్తించి మహిళా ప్రయాణికులను భద్రతారీత్యా చైతన్యవంతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.

మహిళల భద్రత కోసం మేరీ సహేలీ పేరిట ప్రత్యేక చర్యలు

author img

By

Published : Nov 6, 2020, 5:56 AM IST

ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్... మేరీ సహేలీ పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే 8 ప్రధాన రైళ్లను గుర్తించి మహిళా ప్రయాణికులను భద్రతారీత్యా చైతన్యవంతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తెచ్చినట్లు... రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణం ప్రారంభమయ్యే స్టేషన్ల వద్ద సబ్​ ఇన్​స్పెక్టర్లు, సిబ్బందితో కూడిన మహిళా రైల్వే భద్రతా దళం మహిళా ప్రయాణికులతో మాట్లాడతారు.

ప్రయాణ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తెలపడం సహా అత్యవసర సమయాల్లో 182 నంబర్​కు ఫోన్ చేయాల్సిందిగా సూచిస్తారు. ఇందులో భాగంగా ఆర్​పీఎఫ్​ సిబ్బంది... మహిళలు ప్రయాణించే సీట్ల నంబర్లను సేకరించి మార్గమధ్యలో రైలు ఆగే స్టేషన్ల గురించి వారికి సమాచారమిస్తారు. మహిళలు ప్రయాణిస్తున్న బోగీలు, బెర్త్‌లపై ఆర్​పీఎఫ్ సిబ్బంది దృష్టి కేంద్రీకరించడం సహా అవసరం అనుకుంటే మహిళలతో మాట్లాడతారు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు.

గోల్కొండ ఎక్స్​ప్రెస్, గోదావరి ఎక్స్​ప్రెస్, రాయలసీమ ఎక్స్​ప్రెస్, సచ్​ఖండ్ ఎక్స్​ప్రెస్, నందిగామ్ ఎక్స్​ప్రెస్, అమరావతి ఎక్స్​ప్రెస్, మైసూరు ఎక్స్​ప్రెస్ రైళ్లలో ప్రస్తుతానికి ఈ చర్యలు తీసుకున్నారు.

ఇదీ చూడండి: చెరుకు బిల్లు బకాయిలు చెల్లించాలంటూ రైతుల నిరాహార దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.