skincare influencer lasya chittella interview: ఆమె.. లా చదువుకుని ఇన్‌ప్లూయెన్సర్‌గా మారింది. నానాటికీ పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ఇంట్లో వారెవరూ మెుదట్లో మద్దతు ఇవ్వకపోయినప్పటికీ ముందుకు సాగి తానేంటో నిరూపించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటీ ఇన్‌ప్లూయెన్సర్‌గా రాణిస్తోంది. 25 వేల మంది ఫాలోవర్స్‌తో బ్యూటీ, స్కిన్ కేర్ రంగంలో ముందుకెళ్తోంది. ఆమే లాస్యా చిటెల్ల. బ్యూటీ, స్కిన్ కేర్ విభాగంలో దక్షిణ భారతదేశంలో ఉన్న అతి తక్కువ మంది ఇన్‌ప్లూయెన్సర్‌లలో లాస్యా కూడా ఒకరు. కామా ఆయుర్వేద, ప్లమ్, ఇన్నిస్ ఫ్రీ వంటి పెద్ద పెద్ద స్కిన్ కేర్ బ్రాండ్స్‌తో సహకరిస్తూ దూసుకెళ్తూ తన ఉనికిని చాటుతోంది. చిన్న వయసులో ఎంతో మంది ఆదరణ పొందుతూ తన కాళ్ల మీద తాను నిలబడుతూ నేటి తరం అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం ఎంతో అవసరం అని చాటి చెప్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ లాస్యా చిటెల్లతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..
ఇవీ చూడండి..
కమలం.. కరోనా కంటే ప్రమాదం.. రాష్ట్రంలో బలపడనిచ్చేది లేదు: కూనంనేని
'త్వరలో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తా.. డబ్బు ఎలా సంపాదించాలో తెలిసింది!'