కరోనాతో వర్క్ ఫ్రమ్ హోంకు విధానానికి ఉద్యోగులు అలవాటు పడ్డారు. వ్యాక్సినేషన్ రావడంతో కార్యాలయాలకు తిరిగి రానున్నారా? ఇది ఉద్యోగుల జీవితంలో భాగం కానుందా? అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. వ్యాక్సినేషన్‌తో వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పూర్తిగా మార్పురాదని చెప్తున్నారు సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షుడు భరణికుమార్. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ వెంటనే వర్క్ ఫ్రమ్ హోం తొలగించలేరని అభిప్రాయపడ్డారు. మార్చి నాటికి 30శాతం కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానం తొలగిస్తాయని అంచనా వేశారు. 2021 చివరకు 70శాతం కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం తొలగించే అవకాశముందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఉండే 50 నుంచి 60 శాతం ఉద్యోగులు సొంతూర్లకు వెళ్లారు కాబట్టి ఉద్యోగులు వెంటనే తిరిగి కార్యాలయాలకు వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుందని వివరించారు. వర్క్ ఫ్రమ్ హోం విధానంతో ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతోందని... రిటర్న్ టూ ఆఫీస్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారంటోన్న సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షుడు భరణికుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: రెండోరోజూ జోరుగా వ్యాక్సినేషన్... ప్రతి కేంద్రంలో 50 మందికి టీకాలు