సికింద్రాబాద్లోని చిలకలగూడ మున్సిపల్ మైదానంలో అఖిషా పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాథుడిని అంగరంగవైభవంగా రంగురంగుల అలంకరణలతో చిలకలగూడ వీధుల మీదుగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. నిమజ్జనోత్సవంలో భాగంగా లంబాడీల నృత్యాలు, కేరళ వాయిద్యాలు, బ్రాహ్మణుల మేళతాళాలు, బతుకమ్మ కోలాటాలు, మహారాష్ట్ర వాయిద్యాల మధ్య కోలాహలంగా శోభాయాత్ర జరిగింది. కనుల పండువగా రంగురంగుల దీపాల కాంతులతో గణనాథుడు గంగమ్మ ఒడికి బయలుదేరాడు.
ఇవీచూడండి: బంగారు లడ్డూ వేలం... ఎంతపలికిందంటే