హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల అనంతరం పేరుకు పోయిన 52 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను 960 బృందాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా తొలగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్, బస్తీ దవాఖానాల పనితీరు, వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం పంపిణీపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్తో సమావేశమైన సీఎస్... పురోగతిని తెలుసుకున్నారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా వ్యర్థాల తొలగింపుతో పాటు రసాయనాల పిచికారీ సహా ఇతర కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.