ETV Bharat / state

లాలాగూడలో రైల్వే ఉద్యోగుల కోసం ప్రత్యేక కొవిడ్ వార్డు - రైల్వే ఉద్యోగులకు కొవిడ్ వార్డు

దక్షిణ మధ్య రైల్వే లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రిలో ప్రత్యేక కొవిడ్ వార్డును ఏర్పాటు చేసింది. కరోనా సోకిన రైల్వే సిబ్బందికి వైద్యం అందించేందుకు వార్డును ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా పలువురు దాతలు పలు వైద్య పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు.

covid
covid
author img

By

Published : May 26, 2021, 7:07 PM IST

కొవిడ్ సోకిన రైల్వే సిబ్బందికి వైద్యం అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రిలో ప్రత్యేక కొవిడ్ వార్డును ఏర్పాటు చేసింది. లాలాగూడ సెంట్రల్ రైల్వే ఆసుపత్రికి పలువురు దాతలు విరాళంగా పలు వైద్య పరికరాలను అందజేస్తున్నారు. ఇవాళ మెసర్స్ స్వర్ణ గ్రూఫ్ ఆఫ్ కంపెనీ రూ.10లక్షల విలువ గల 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందజేశారు.

శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి ఇవి తోడ్పడతాయని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం తరపున ఇన్ పేషంట్లకు ఉపయోగపడే 12 సైడ్ రేలింగ్స్ తో గల సెమీ-ఫౌలర్ బెడ్లను, మెట్రస్ తో కూడిన వీల్స్, సెలైన్ స్టాండ్స్, 10 కంఫర్ట్ చైర్లను విరాళంగా అందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.