Special Attraction: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కసింకోటలో పడమటమ్మ అమ్మవారి నెల పండుగ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అరటి గెలల పందిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండేళ్లకోసారి గొంతిన కుటుంబీకుల ఇలవేల్పు పడమటమ్మ అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీంట్లో భాగంగా పందిరి ఏర్పాటు చేయడం అనవాయితీగా వస్తోంది. కసింకోట, అనకాపల్లి, బుచ్చయ్యపేట మండలానికి చెందిన 14 గ్రామాలు మంగళవారం ఈ పండుగ నిర్వహించారు. అరటి గెలలు, కొబ్బరి గెలలు, పండించిన వ్యవసాయ ఉత్పత్తులు, బెల్లం, వివిధ రకాల పండ్లు ఊరేగింపుగా తీసుకొచ్చి పందిరిలో అలంకరించారు. అమ్మవారిని అదిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చదవండి: