- అన్ని పనులూ మనమే చేయాలనుకోవడం, విరామం లేని పని వంటివాటివల్ల త్వరగా అలసిపోతుంటారు. ఈ తీరు దీర్ఘకాలంలో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. మంచి నాయకురాలిగా మారాలంటే... మీరొక్కరే పనిచేయడం కాదు... సరిగా పని విభజన జరిగి, ఎవరిపని వారు చేయగలిగితేనే మీరు విజయం సాధించినట్లు అని గుర్తుంచుకోండి. అప్పుడే ఒత్తిడికి దూరంగా ఉంటారు. అందరి మన్ననలూ అందుకోగలుగుతారు.
- చాలామంది తాము అలవాటు పడ్డ విధానానికి భిన్నంగా ఏదైనా జరుగుతుంటే... అంత సులువుగా తీసుకోలేరు. అలాంటి సందర్భాల్లో మీరు ఒంటరి కావొచ్చు. సమస్య ఎలాంటిదైనా సరే! అన్ని కోణాల్లోనూ ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారి సలహాలు స్వీకరించడం, వారి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోవడం వంటివీ చేయగలగాలి. అప్పుడే ఒత్తిడీ, ఆందోళనా తగ్గుతాయి. అంతిమంగా నిర్ణయం తీసుకునే శక్తినీ అలవరుచుకోవాలి.
- సాధారణంగా మహిళలు సవాళ్లు తీసుకోలేరనీ, ప్రతిపనికీ ఇతరులపై ఆధారపడతారంటారు కొందరు. మీరు పనిచేయడానికి, మిమ్మల్ని మీరు నిరూపించుకునే విషయంలోనూ పరిధులు గీసుకోవద్దు. ఒకవేళ ఎవరైనా మీ శక్తి సామర్థ్యాలను తక్కువ చేస్తుంటే... బాధపడొడ్దు. దాన్ని ఓ సవాలుగా తీసుకుని మీరెంత వైవిధ్యంగా ఆ పని చేయగలరో చేసి చూపండి. విమర్శకులకు మీ చేతలే సమాధానం చెప్పాలి. ప్రతి పనికీ ప్రణాళిక ఉంటే మీదే విజయం.
'అలా ముందుకు సాగితే.. అనుకున్నది సాధ్యం' - Special article for women
నేటి మహిళలు ఇంటిని చక్కబెట్టుకుంటూ, విధుల్నీ సమర్థంగా నిర్వర్తిస్తూ... కత్తిమీద సామే చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి తెలియకుండానే మూస ధోరణిలోకి వెళ్లిపోవడం, గుర్తింపు దొరకడం లేదని కుంగిపోవడం జరుగుతుంటాయి. అలాకాకుండా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు సాగితే... అనుకున్నది సాధ్యమే.
'అలా ముందుకు సాగితే.. అనుకున్నది సాధ్యం'