ETV Bharat / state

'దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు'

హైదరాబాద్​లోని నెక్లెస్​రోడ్డులో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 500 మీటర్ల దివ్యాంగుల నడకను స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ పాటుపడుతున్నారని తెలిపారు.

author img

By

Published : Dec 3, 2019, 12:47 PM IST

speaker pocharam srinivas reddy spoke on disability walk
'వికలాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు'

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఘనంగా జరిగింది. దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్​ ప్లాజా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​, తదితరులు పాల్గొన్నారు. ​ ఐదు వందల మీటర్ల నడకను స్పీకర్ జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులకు మానసిక ధైర్యం ఇవ్వడంతో పాటు దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్​ పెద్దపీట వేశారని పోచారం శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.

అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా... దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు వేల 16 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. అంగవైకల్యం మనిషి ప్రతిభకు ఏ మాత్రం అడ్డుకాదని... మనసు ఉంటే మార్గం ఉంటుందని, సాధించాలని పట్టుదల ఉంటే విజయం అసాధ్యం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు.

'దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు'

ఇవీ చూడండి: చట్టాల 'దిశ' మార్చండి.. కేంద్రాన్ని కోరనున్న సీఎం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.